ETV Bharat / city

Black Fungus: విశాఖ కేజీహెచ్​లో బ్లాక్ ఫంగస్​కు మెరుగైన వైద్యం

author img

By

Published : May 29, 2021, 3:41 PM IST

విశాఖలో బ్లాక్ ఫంగస్ కేసులకు కేజీహెచ్​లో మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా బెడ్లను ఏర్పాటు చేసిన యంత్రాంగం... ఇప్పుడు శస్త్ర చికిత్సలు కూడా నిర్వహిస్తోంది. ప్రధానంగా ఈ కేసుల్లో కన్ను తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వైద్యులు చెబుతున్నారు.

విశాఖ కేజీహెచ్​లో బ్లాక్ ఫంగస్​కు మెరుగైన వైద్యం

డా.పీవీ సుధాకర్

ఆంధ్ర వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న కింగ్​జార్జి ఆసుపత్రి ఇప్పుడు కొవిడ్ అనంతర ఫంగస్ చికిత్సకు సిద్ధమైంది. వివిధ జిల్లాల నుంచి బ్లాక్ ఫంగస్ బాధితులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్... బ్లాక్ ఫంగస్​కు ప్రత్యేక చికిత్స అందించాలని బెడ్లను ఏర్పాటు చేయించారు. సీరియస్ కేసులు ఇక్కడకే రావడం వల్ల వెనువెంటనే శస్త్రచికిత్సలను చేయాల్సి వస్తోంది.

కొవిడ్ ఫస్ట్ వేవ్​లోనూ చికిత్సలో వాడిన స్టెరాయిడ్లు, ఆక్సిజన్ వంటివే రెండో వేవ్​లో రోగులకు వాడుతున్నారని... అందువల్ల బ్లాక్ ఫంగస్ వస్తోందన్న అంశంపైన ఆధ్యయనం సాగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రభావం ఏరకంగా చూపిస్తోందో... అధ్యయనాల్లోనే తేలాల్సిందే. కేజీహెచ్​లో సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉండడంవల్ల మెరుగైన చికిత్స అందుతోంది. భయం వీడి... లక్షణాలు ఏమాత్రం కన్పించినా వెంటనే అసుపత్రికి వచ్చి చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండీ... Anandayya Medicine : ఆనందయ్య ఔషధంపై నేడు చివరి నివేదిక : ఆయుష్ కమిషనర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.