ETV Bharat / city

పీఎఫ్​ఆర్​కు నౌకాదళం ఏర్పాట్లు... పాల్గొననున్న 60కిపైగా నౌకలు - ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ న్యూస్​

Presidential Fleet Review: పీఎఫ్​ఆర్​(ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ) కోసం తూర్పు నౌకాదళం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 10వేల మంది నావికులు, నౌకాదళం, కోస్ట్ గార్డు, ఎన్​ఐఓలకు చెందిన 60కి పైగా నౌకలు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నాయి. రెండు వరుసలలో ఉండే ఈ నౌకల్లోని నావికుల నుంచి రాష్ట్రపతి ఒక నౌకలో ప్రయాణించి గౌరవ వందనం స్వీకరిస్తారు.

PFR
పీఎఫ్​ఆర్​కు ఏర్పాట్లు
author img

By

Published : Feb 18, 2022, 12:27 PM IST

Presidential Fleet Review: పీఎఫ్​ఆర్​(ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ) కోసం తూర్పు నౌకాదళం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఐఎన్​ఎస్ సుమిత్రలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రయాణించి నౌకలలో ఉన్న సిబ్బంది నుంచి వందనం అందుకుంటారు. వీటికి అదనంగా 55 ఎయిర్ క్రాప్టులు, సబ్​మెరైన్​ల సిబ్బంది ఇందులో పాల్గొంటారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హవ్ ఎయిర్ క్రాప్టులు సైతం ఇందులో పాలు పంచుకుంటాయి. నౌకలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో ఈ రివ్యూ కోసం సిద్ధంగా ఉంచుతారు.

Presidential Fleet Review: మెరైన్ కమాండోలు చేయనున్న ప్రమాదంలో కాపాడే ఘట్టం, నీటి పారాజంప్ లాంటివి చూపరులను ఆశ్చర్యపరుస్తాయి. హవ్ ఎయిర్ క్రాప్టు నుంచి ఎరోబెటిక్స్ ఫార్మేషన్ కూడా సాహసానికి మరోరూపంగా నిలవనుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి తొలి రోజు పోస్టల్ కవర్, పోస్టల్ స్టాంపులను విడుదల చేయనున్నారు. ఇందులో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్ సిన్హా జే చౌహాన్ పాల్గొననున్నారు.

ఈనెల 21 నుంచి విశాఖ వేదికగా..

శత్రువులను ధైర్యంగా ఎదుర్కొవాలంటే ముందు మన శక్తిసామర్థ్యాలు ఎంత మేరకు ఉన్నాయో తెలిసి ఉండాలి. ఏ మేరకు పోరాడగలమో సమీక్షించుకోవాలి. అలా నౌకాదళ బలాన్ని సమీక్షించేదే ప్రెసిడెంట్‌ ప్లీట్‌ రివ్యూ. ఈనెల 21 నుంచి విశాఖ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొంటారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఈ నెల 20నే విశాఖ వెళ్లనున్నారు. రాష్ట్రపతిని ఆహ్వానించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దేశ మెరైన్ అవసరాలకు అనుగుణంగా.. నౌకల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు నౌకాదళం సన్నద్దంగా ఉండాల్సి ఉంటుంది. ఆ సన్నద్ధతను బేరీజు వేసుకునేందుకు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ఒక కొలమానంగా ఉంటుంది. అత్యంత చాకచక్యంగా వ్యవహరించడం, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడం.. మన సత్తా చాటి చెప్పడం.. వంటి అంశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి.

75 ఏళ్ళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ సారి ప్రెసిడెంట్ ప్లీట్‌ రివ్యూను దేశ సేవలో 75 ఏళ్లు అన్న నినాదంతో నిర్వహిస్తున్నారు. 60 నౌకలు, సబ్ మెరైన్లు, 50కి పైగా ఎయిర్ క్రాప్టులతో ముఖ్య విన్యాసాలు నిర్వహించనున్నారు. ప్రెసిడెంట్ ప్లీట్‌ రివ్యూలోని నౌకా విన్యాసాలను ఆర్కే బీచ్‌ నుంచి ప్రజలు సైతం వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ వేదికగా.. ఈనెల 21 నుంచి ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.