ETV Bharat / city

రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష.. అధికారులకు దిశానిర్దేశం

విశాఖ కలెక్టరేట్​లో అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈనెల 21 రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలన్నారు.

ap cs review on Vishaka Development
ap cs review on Vishaka Development
author img

By

Published : Feb 12, 2022, 4:37 PM IST

విశాఖలో ఈనెల 21 జరగనున్న ప్రెసిడెంట్ ఫిలిం రివ్యూతోపాటు 27, 26 తేదీల్లో జరగనున్న మిలన్ విన్యాసాలపై సీఎస్ సమీక్షించారు. విశాఖ కలెక్టరేట్​లో అధికారులతో భేటీ అయిన సీఎస్.. ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీచ్ రోడ్డు సుందరీకరణకు సంబంధించి చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

అన్ని విభాగాలూ సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లూ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. బీచ్ రోడ్​తోపాటు నేవీ ప్రాంతంలోనూ ఇందుకోసం చేపట్టిన ఏర్పాట్లను సీఎస్ స్వయంగా పరిశీలించారు.

ఇదీ చదవండి

విశాఖ సాగరతీరానికి నేవీ కళ.. ఆర్‌కే బీచ్‌కు రంగుల హంగులు

మూడు చోట్ల రాజధానులు పెడితే ఎక్కడకు రావాలి: కేంద్రమంత్రి అఠావలే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.