ETV Bharat / city

విశాఖ విమానాశ్రయంలో హైజాక్ నిరోధక విన్యాసం - విశాఖ విమానాశ్రయంలో హైజాక్ నిరోధక విన్యాసం

విశాఖ విమానాశ్రయంలో హైజాక్ నిరోధక విన్యాసం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని రక్షక దళాల సమన్వయంతో దళ సభ్యులు విన్యాసాలు చేశారు. ఏడాదికి ఒకసారి హైజాక్ నిరోధక సన్నద్ధత కోసం ఈ తరహా విన్యాసాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

anti high jack  dril at vishakapatnam air port
విశాఖ విమానాశ్రయంలో హైజాక్ నిరోధక విన్యాసం
author img

By

Published : Feb 13, 2020, 5:09 PM IST

రక్షక దళాల సమన్వయంతో విశాఖలో హైజాక్ నిరోధక విన్యాసం

హైజాక్​ నిరోధక సన్నద్ధత కోసం ఏడాదికోసారి చేసే విన్యాసాలు విశాఖ విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ విన్యాసంలో నేవీ, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, రాష్ట్ర పోలీసు దళాలు పాల్గొన్నాయి. హైజాక్ పరిస్థితులు కృత్రిమంగా కల్పించి, వాటిని ఏ రకంగా ఎదుర్కొంటారనే అంశాన్ని ఈ విన్యాసాల ద్వారా పరీక్షిస్తారు. మెరైన్ కమెండోలు పూర్తి స్థాయిలో తమ సన్నద్ధతను ప్రదర్శించారు. వీరికి సహాయంగా సీఐఎస్ఎఫ్ ఎయిర్​పోర్ట్ అథారిటీ దళాలు తమ వంతుగా బాధ్యతలు నిర్వర్తించారు. యాంటీ హైజాక్ ఆపరేషన్ల సమర్థంగా నిర్వహించడం ద్వారా భద్రతా పరమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు ఈ విన్యాసాలు తోడ్పడతాయని నౌకాదళం వెల్లడించింది.

నౌకాదళానికి చెందిన విమానాన్ని డోర్ నియర్ విమానం ద్వారా యాంటీ హైజాక్ ఆపరేషన్​ను అధికారులు సమన్వయం చేశారు. అనంతరం ఉగ్రవాదులను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు దళాలు సన్నద్ధత ఏ రకంగా ఉండాలన్నదానిపైనా సమగ్రంగా చర్చించారు. జాతీయ పౌర విమానయాన భద్రత కార్యక్రమం కింద ప్రతి ఏటా అన్ని విమానాశ్రయాల్లో ఈ విన్యాసాలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

ఇదీ చదవండి:

'కార్యాలయాలు వేరే జిల్లాకు మార్చడమెందుకు?'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.