ఐపీఎస్ అధికారి ఏబీ.వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ ధర్మాసనం నుంచి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకున్నారు. దీపావళి సెలవుల తర్వాత మరో ధర్మాసనం ముందు విచారణ జరగనుంది.
ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో.. ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ధర్మాసనం నుంచి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకోవటంతో.. కేసు వాయిదా పడింది.
ఇదీ చదవండి: