ETV Bharat / city

దీనులకు చేయూతనందిస్తోన్న విశాఖ యువతి

author img

By

Published : Oct 9, 2020, 11:50 AM IST

అలమటిస్తోన్న వృద్ధులకు అమ్మలా అన్నం పెడుతోంది.. ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని విద్యార్థులకు ఓ అక్కలా చేయూతనిస్తోంది.. అనారోగ్యంతో బాధపడుతోన్న వారికి ఓ కూతురిలా ఆపన్న హస్తం అందిస్తోంది. అలాగని ఆమె శ్రీమంతురాలు కాదు, ఓ సామాన్యురాలు. తెలుగు రాష్ట్రాల్లోని దీనులకు చేయూతనందిస్తోంది విశాఖపట్నానికి చెందిన మజ్జి శ్రీదేవి.

majji sridevi
దీనులకు చేయూతనందిస్తోన్న విశాఖ యువతి

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన శ్రీదేవిని తల్లే పెంచింది. ఇంటర్‌ వరకూ చదువుకున్న ఆమె... మొదట్లో చిన్నచిన్న పనులు చేసి కొంతకాలం టీవీ యాంకర్‌గానూ పని చేసింది. ఆ అనుభవంతో సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించింది. చిన్నప్పుడే నాన్న ప్రేమకు దూరం కావడంతో.. తండ్రి వయసున్న వ్యక్తులు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోలేక తోచిన సాయం చేసేది. అలాగే ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టడంతోపాటు కొత్త దుస్తులు ఇవ్వడం, ఆర్థిక సాయం చేయడం మొదలుపెట్టింది. కొన్నాళ్ల కిందట ఓ కుటుంబానికి శ్రీదేవి సాయం చేసినప్పుడు ఆ చుట్టుపక్కలవారూ తమ వంతుగా సహకారం అందించారు. దాంతో చేసే మంచి పని నలుగురికీ తెలిస్తే ఎక్కువమందికి సాయపడొచ్చనే ఆలోచన వచ్చింది శ్రీదేవికి. అప్పట్నుంచీ కష్టంలో ఉన్నవారికెవరికైనా సాయం చేసినప్పుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతోంది. వాటిని చూసిన చాలామంది సాయం చేయడానికి ముందుకు రావడంతో అవసరమైన వారికి పెద్ద మొత్తంలో సాయం అందుతోంది.

అక్షింతలతో అన్నం వండుకుంటున్నారని...

గుంటూరుకు చెందిన వృద్ధ దంపతుల విషయంలోనూ ఇలాగే జరిగింది. వీళ్లిద్దరూ ప్రైవేటు స్కూల్లో టీచర్లుగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. వారికి పెన్షనూ రాదు. వయోభారంతో వారి ఆరోగ్యమూ క్షీణించింది. వారికి పిల్లలూ లేరు. తినడానికి తిండి లేక గుడి నుంచి అక్షింతలు తెచ్చుకుని శుభ్రంచేసి వాటితోనే అన్నం వండుకుంటున్నారని తెలుసుకుని చలించిపోయింది శ్రీదేవి. వెంటనే వారికి నిత్యావసర సరకులతోపాటు, ఆర్థిక సాయం అందించి ఈ వీడియోను తన యూట్యూబ్‌ ఛానెల్‌ ‘మిస్‌ శ్రీదేవి’లో అప్‌లోడ్‌ చేసింది. దీన్ని ఆ ఉపాధ్యాయుల దగ్గర చదువుకున్న విద్యార్థుల్లో చాలామంది సామాజిక మాధ్యమాల్లో చూసి స్పందించడంతో వారికి సాయం సమకూరింది. ఇప్పుడా దంపతులు శేష జీవితాన్ని నిశ్చింతగా గడుపుతున్నారు.

తానున్నాననే భరోసాను కల్పిస్తూ..

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిత్యం పత్రికల్లో, టీవీల్లో, సోషల్‌ మీడియాలో ఆర్థిక సాయం అవసరమైన వారి వివరాలు తెలుసుకుంటుంది శ్రీదేవి. ఆ వెంటనే ఆ ప్రాంతానికి తన కారులో వెళ్తుంది. ఎత్తం అనే గ్రామంలోని ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో రెండేళ్లుగా ఇంటికే పరిమితమైతే భార్య అతడిని వదిలేసి చిన్నారితో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ కథ తెలుసుకున్న శ్రీదేవి వెంటనే రూ.10వేలు అందించింది. ఆ తర్వాత భార్యతో మాట్లాడి, భర్త వద్దకు వచ్చేలా చేసింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగైంది. మరోసారి వాళ్లను కలసి రూ.పదివేలు, మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలూ అందించింది. అలాగే పెబ్బేరుకు చెందిన లలితా అనే ఎనిమిదేళ్ల అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయారు. ఆమెతోపాటు తన ఇద్దరి తమ్ముళ్లనూ ఆశ్రమంలో చేర్చించింది. వాళ్లకు తానున్నాననే భరోసాను కల్పిస్తూ తరచూ వెళ్లి వాళ్లను చూసి వస్తుంది శ్రీదేవి. ఇలా ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందలకు పైగా కుటుంబాలకు ఈమె ద్వారా సాయం అందింది.

ఇదీ చదవండి:

అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.