ETV Bharat / city

YSRCP Plenary: వైకాపా ప్లీనరీకి సర్వం సిద్ధం..భారీ జనసమీకరణకు సన్నాహాలు

వైకాపా ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని నాగార్జున వర్సిటీ ఎదురుగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్లీనరీ నిర్వహిస్తుండటంతో భారీ జనసమీకరణకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల్లోపు మరో ప్లీనరీ ఉండదు కాబట్టి దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్లీనరీలో మెుత్తం పది తీర్మానాలు ప్రవేశ పెట్టనన్నట్లు తెలుస్తోంది.

వైకాపా ప్లీనరీకి సర్వం సిద్ధం
వైకాపా ప్లీనరీకి సర్వం సిద్ధం
author img

By

Published : Jul 7, 2022, 7:03 AM IST

అధికారంలోకి వచ్చాక తొలిసారి వైకాపా ప్లీనరీ నిర్వహించనుంది. ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో రెండు రోజులపాటు ప్లీనరీ ఉంటుంది. ఎన్నికల్లోపు మరో ప్లీనరీ ఉండదు కాబట్టి దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. సుమారు 4 లక్షల మందికి పైగా జనసమీకరణ చేపట్టే అవకాశం ఉందంటున్నారు. ఇందుకు అనుగుణంగా ప్లీనరీ వేదిక పక్కనే దాదాపు 40 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. రెండో రోజు సాయంత్రం వైకాపా అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగించనున్నారు. రోజుకు అయిదు చొప్పున రెండు రోజుల్లో 10 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. పార్టీ నియమావళి సవరణ ప్రతిపాదననూ తొలిరోజునే ఆమోదించనున్నారు. అదేరోజు మహిళా సాధికారత- దిశ చట్టం, విద్య, వైద్యం, ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), పరిపాలన-పారదర్శకత, రెండో రోజు సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు-ఎంఎస్‌ఎంఈ-ప్రోత్సాహకాలు, దుష్ట చతుష్టయం అనే అంశాలపై తీర్మానాలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

కార్యక్రమాలు ఇలా..: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి (జులై 8) సందర్భంగా వేదికపై ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి జగన్‌ పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. తర్వాత ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసంతో ప్లీనరీ మొదలుకానుంది. వెంటనే పార్టీ అధ్యక్ష ఎన్నికకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటన చేయనున్నారు. తర్వాత పార్టీ నియమావళి సవరణ తీర్మానాన్ని ఆమోదిస్తారు. తర్వాత రాజకీయ తీర్మానాలు ప్రవేశపెడతారు. రెండోరోజు వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ప్రసంగం ఉంటుందని షెడ్యూలులో పేర్కొన్నారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత జగన్‌ను మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. తర్వాత ఆయన ప్రసంగంతో ప్లీనరీ ముగియనుంది.

ప్లీనరీ నిర్వహణ కోసం పలు కమిటీలను నియమించారు. ఆ వివరాలు ఇలా...

  • ప్లీనరీ నిర్వహణ సమన్వయకర్త: మంత్రి బొత్స సత్యనారాయణ
  • ఆహ్వాన కమిటీ: తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
  • ప్రజాప్రతినిధుల సమన్వయం: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
  • వేదిక, ప్రాంగణం, నిర్వహణ: ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం
  • సభా నిర్వహణ కమిటీ: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • వేదికపై ప్రొటోకాల్‌ సమన్వయం: మంత్రి తానేటి వనిత
  • అలంకరణ కమిటీ: వెలంపల్లి శ్రీనివాసరావు
  • వసతి ఏర్పాట్ల కమిటీ: కొలుసు పార్థసారథి
  • తీర్మానాల కమిటీ: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
  • ప్రతినిధులు, పాస్‌ల కమిటీ: మంత్రి గుడివాడ అమర్‌నాథ్
  • భోజన వసతుల కమిటీ: ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి
  • పార్టీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ కమిటీ: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
  • మీడియా, చిత్ర ప్రదర్శన కమిటీ: ఎమ్మెల్యే పేర్ని నాని
  • ఆరోగ్య కమిటీ: మంత్రి సీదిరి అప్పలరాజు
  • సాంస్కృతిక కమిటీ: వంగపండు ఉష
  • వాలంటీర్ల కమిటీ: ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి
  • రవాణా కమిటీ: విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ చిన్న శ్రీను
  • సభాప్రాంగణం నిర్వహణ కమిటీ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.