ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వానికి అప్పగించవద్దని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రభుత్వానికి వాటిని ఇచ్చిన మరుక్షణం కళాశాలలను గదులుగా అమ్మేస్తారని ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రుణాలిచ్చే ముందు బ్యాంకర్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
సంపూర్ణ మద్యపాన నిషేధమని అందరం ప్రచారం చేశామన్న రఘురామ.. కానీ ఇప్పుడది జగనన్న పరిపూర్ణ మద్యపాన దీవెనగా మారిందని ఎద్దేవా చేశారు. పాలకుల అక్షయపాత్ర కోసం ఎక్కడలేని పథకాలు తెస్తున్నారని అన్నారు.
వివేకా గుండెపోటుతోనే మృతిచెందారన్నది ఎవరో విచారణ జరపాలని ఎంపీ రఘురామ కోరారు. వివేకా మృతికి కారణం గుండెపోటు అని అన్నదెవరో విజయసాయిరెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈనెల 25 తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆయన అంచనా వేశారు.
ఇదీ చదవండి:
VIJAYSAI: విజయసాయి బెయిల్ రద్దుపై నిర్ణయం మీదే: కోర్టులో సీబీఐ మెమో