వరదలపై తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతల వ్యవహార శైలిపై వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. వరద అనంతరం ప్రజలు ప్రశాంతంగా ఉన్నా... తేదేపా నేతలు మాత్రం వరద రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై అనవసరర విమర్శలు చేస్తూ బురద జల్లుతున్నారని ఆక్షేపించారు. డ్రోన్ ద్వారా చంద్రబాబు నివాసాన్ని చిత్రీకరించడాన్ని సమర్దించిన ఆయన.. దీనిపై రాద్దాంతం చేయడం తగదన్నారు. దేవినేని ఉమా, బోండా ఉమా, బుద్దా వెంకన్నతో పాటు తెదేపా నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు..
ఇవీ చూడండి-'చంద్రబాబు ఇంటిని ముంచాలనే ఆలోచన లేదు'