ETV Bharat / city

'జగన్ చిత్త శుద్ధితోనే చరిత్రాత్మక విజయం' - పంచాయతీ ఎన్నికలపై వైసీపీ లీడర్స్ కామెంట్స్

ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమని వైకాపా నేతలు వ్యాఖ్యానించారు. మూడు దఫాల కంటే నాలుగో విడత ఎన్నికల్లోనే ఫలితాలు మెరుగ్గా వచ్చాయని పార్టీ నేతలు తెలిపారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచామని.. మున్సిపల్​ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

'జగన్ చిత్త శుద్ధితోనే చరిత్రాత్మక విజయం'

author img

By

Published : Feb 22, 2021, 4:14 AM IST

‘ప్రజలను నమ్ముకుని, వారి కుటుంబాల్లో వెలుగు నింపడమే రాజకీయ పరమావధి అని నమ్మే ముఖ్యమంత్రి జగన్‌.. 20 నెలల పాలనలో ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందిస్తూ తన నిజాయతీ, చిత్తశుద్ధిని 200 శాతం నిరూపించుకున్నారు. అందువల్లే పంచాయతీల్లో ప్రజలు ఇంతటి చరిత్రాత్మక తీర్పును వైకాపాకు అనుకూలంగా ఇచ్చారు’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆదివారం రాత్రి వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద ‘పల్లె విజయం.. జగనన్నకు జనాభిషేకం’ పేరుతో సంబరాలు నిర్వహించారు. వేడుకల్లో సజ్జల, పలువురు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సజ్జల మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను ఒక ఆశతో ఎన్నుకున్నారు. 20 నెలల పాలన తర్వాత ఆయనపై పూర్తి నమ్మకంతో ఈ ఎన్నికల్లో సుమారు 85 శాతం పంచాయతీలను ప్రజలు వైకాపాకు కట్టబెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో జగన్‌ ఎక్కడా కలుగజేసుకోలేదు. కానీ, చంద్రబాబు రోజూ మీడియాలో మాట్లాడుతూ.. ఎస్‌ఈసీ, కేంద్రానికి లేఖలు రాశారు’ అని వ్యాఖ్యానించారు.
1,128 పంచాయతీల్లో గెలిచాం: బొత్స
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 13,125 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే మొదటి మూడు విడతల్లోనే 7,658 కైవసం చేసుకున్నామన్నారు. తెదేపా 1575 స్థానాల్లో గెలిచిందని చెప్పారు. ఇప్పుడు నాలుగో విడతలో ఆదివారం రాత్రి 9 గంటల వరకు వచ్చిన ఫలితాల్లో 1128 స్థానాల్లో వైకాపా సానుభూతిపరులే గెలిచారని, తెదేపా 89 స్థానాలకే పరిమితమైందని ప్రకటించారు. మాటలతో ప్రజలను మభ్యపెట్టి, గ్రాఫిక్స్‌ను నమ్ముకుని అధికారాన్ని సాధించాలనుకునే చంద్రబాబు కాలం ఇక ముగిసింది. ప్రజలు చైతన్యవంతులయ్యారు. నా కుటుంబం, నా గ్రామం, నా ప్రాంతానికి ప్రభుత్వం ఏం చేస్తోందని ఆలోచిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే జగన్‌ పాలన సాగుతోంది కాబట్టే ప్రజలు ఈ తీర్పునిచ్చారు’ అని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెదేపాకూ ఒక్క నియోజకవర్గమూ లేనట్లే అన్నట్లుగా పంచాయతీల్లో ప్రజలు వైకాపాను గెలిపించారని మంత్రి అనిల్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.
పంచాయతీ ఎన్నికల్లో తెదేపా కుప్పంలోనూ ఓడిపోయింది.. అంటే చంద్రబాబుకు ఇక రాష్ట్రంలో ఎక్కడా స్థానం లేనట్లేనని మరో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 100 శాతం వైకాపా విజయం సాధిస్తుందన్నారు.
పులివెందులలో నూరు శాతం విజయం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నియోజకవర్గం పులివెందులలో పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలను వైకాపా కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ‘పులివెందుల పరిధిలో 109కి గాను 108 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. వాటిలో 90 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 18లో ఆదివారం జరిగిన పోలింగ్‌లో మొత్తం వైకాపా మద్దతుదారులే విజయం సాధించారు. దీంతో పులివెందులలో వైకాపా మద్దతుదారులు 100 శాతం విజయాన్ని నమోదు చేశారు’ అని పేర్కొంది.

ఇదీ చదవండి: ముగిసిన నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు.. 82.85 శాతం పోలింగ్​ నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.