ETV Bharat / city

Complaint on constable: పూటుగా తాగేసి..యువకులను దూషించిన కానిస్టేబుల్​ - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని నాగర్ కర్నూల్‌ జిల్లాలో కానిస్టేబుల్‌పై యువకులు ఫిర్యాదు చేశారు(Complaint on constable). గణేశ్ మండపం వద్ద మద్యం మత్తులో దుర్భాషలాడినట్లు ఆరోపించారు. ఈ సంఘటనపై వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో(social media) పోస్టు చేశారు.

Youth complaint against constable abused behavioYouth complaint against constable abused behavioYouth complaint against constable abused behavioYouth complaint against constable abused behavioYouth complaint against constable abused behavioYouth complaint against constable abused behavio
పూటుగా తాగేసి గణేశ్ మండపం వద్ద కానిస్టేబుల్ బూతు పురాణం
author img

By

Published : Sep 13, 2021, 3:45 PM IST

తెలంగాణలోని నాగర్ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ఆదివారం అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. ఎర్రగడ్డ కాలనీలో వినాయక మండపం వద్ద సబ్ జైలులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు మద్యం సేవించి హల్‌చల్‌ చేశారు. గణేశ్ మండపం నిర్వాహకులను అసభ్య పదజాలంతో దూషించారని పలువురు యువకులు ఆరోపించారు. తాము 100కు డయల్‌ చేసినా పోలీసులు స్పందించలేదని బాధితులు వాపోయారు.

సార్ అనవసరంగా తిట్టొద్దు అంటూ కానిస్టేబుల్‌తో మాట్లాడుతుండగా పట్టించుకోకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోయారని యువకులు ఆరోపించారు. ఈ గొడవని ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బాధిత యువకుడు ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

CM JAGAN: రాష్ట్ర కార్మికులను భారత్‌కు తీసుకురావాలి.. కేంద్ర మంత్రి జైశంకర్‌కు జగన్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.