ETV Bharat / city

Suicide: కాల్వలో దూకి యువకుడి ఆత్మహత్య.. ప్రేమ వైఫల్యమే కారణమా? - గన్నవరం వార్తలు

సెల్ఫీ వీడియో తీసుకున్న ఓ యువకుడు.. అనంతరం పోలవరం కాల్వలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు.

young men suicide in vijayawada
young men suicide in vijayawada
author img

By

Published : Jan 17, 2022, 2:56 PM IST

పోలవరం కుడి కాలువలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లికి చెందిన గణేష్​గా గుర్తించారు. యువకుడు చనిపోతూ తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపింది.

విషయం తెలుసుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని ఎస్సై రమేష్ వెల్లడించారు. కాగా.. ప్రేమ విఫలమైందన్న బాధతోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: పండగ పూట విషాదం.. స్నానానికెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.