ప్రభుత్వంపై తెదేపా అబద్ధపు ప్రచారం చేయడాన్ని మానుకోవాలని వైకాపా డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఏం జరిగిందని చంద్రబాబు జన చైతన్య యాత్ర చేస్తున్నారో చెప్పాలని ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు చేయాల్సింది ప్రజాచైతన్య యాత్రలు కాదని... పశ్చాత్తాప, ప్రాయశ్చిత్త యాత్రలు చేయాలని వ్యాఖ్యానించారు. పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తోందని... దీన్ని చూసి ఒర్వలేకే చంద్రబాబు సహా తెదేపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అమెరికా అధ్యక్షుడితో విందుకు 8 మంది సీఎంలకే పరిమితంగా ఆహ్వానం పంపారని.. సీఎం జగన్‌కు ఆహ్వానం రాకపోవడంపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు.
ప్రభుత్వంపై దుష్ప్రచారాలు మానండి: ఎమ్మెల్యే జోగి రమేష్ - జోగి రమేష్ లేటెస్ట్
ప్రభుత్వంపై తెదేపా అసత్యాలు ప్రచారం చేస్తోందని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో విందుకు సీఎం జగన్‌ను పిలవకపోవటంపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
ప్రభుత్వంపై తెదేపా అబద్ధపు ప్రచారం చేయడాన్ని మానుకోవాలని వైకాపా డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఏం జరిగిందని చంద్రబాబు జన చైతన్య యాత్ర చేస్తున్నారో చెప్పాలని ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు చేయాల్సింది ప్రజాచైతన్య యాత్రలు కాదని... పశ్చాత్తాప, ప్రాయశ్చిత్త యాత్రలు చేయాలని వ్యాఖ్యానించారు. పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తోందని... దీన్ని చూసి ఒర్వలేకే చంద్రబాబు సహా తెదేపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అమెరికా అధ్యక్షుడితో విందుకు 8 మంది సీఎంలకే పరిమితంగా ఆహ్వానం పంపారని.. సీఎం జగన్‌కు ఆహ్వానం రాకపోవడంపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు.
ఇవీ చూడండి:
'మా భూమి తీసుకుంటే ఆత్మహత్యే శరణ్యం..!'