ETV Bharat / city

రాష్ట్రాన్ని వైకాపా నేరాంధ్రప్రదేశ్​గా చేసింది: బోండా ఉమ

వైకాపా ప్రభుత్వంపై తెదేపా తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ స్కాం జరిగినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని ఆరోపించారు.

Tdp Bonda Uma
బోండా ఉమ
author img

By

Published : Sep 21, 2021, 10:13 PM IST

జగన్​ సర్కార్​పై తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "రాష్ట్రాన్ని వైకాపా.. నేరాంధ్రప్రదేశ్​గా మార్చింది"అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎక్కడ స్కాం జరిగినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రూ.9 వేల కోట్ల హెరాయిన్​(మాదక ద్రవ్యం) మూలాలు ఏపీలో ఉన్నాయని దీనికి వైకాపా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హెరాయిన్​ నిందితుడు సుధాకర్.. వైకాపా మద్దతుతోనే డ్రగ్స్ వ్యాపారం పెట్టాడని విమర్శించారు. ఇప్పటికే వేల కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని వైకాపా నాయకలు రోజూ విదేశాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వెంకటేశ్వరస్వామికి భక్తులు ఇచ్చిన వెంట్రుకల్నీ విదేశాలకు ఎగుమతి చేస్తూ పక్క రాష్ట్రాల్లో దొరికిపోయారని దుయ్యబట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలకు డబ్బు తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో వైకాపా నాయకులు పది తరాలకు సరిపడా సంపాదించారని విమర్శించారు.

ఇదీ చదవండి: PERNI NANI: 'తెదేపా నేతలు.. ఆంధ్రా తాలిబన్లుగా తయారయ్యారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.