ETV Bharat / city

Yanamala On Budget: కేంద్రం జోక్యం చేసుకోకపోతే.. పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం: యనమల

Yanamala comments on the financial manipulations: రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని.. తెదేపా డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో ఆర్టికల్ 360 ప్రయోగించి ఆర్ధిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని.. పార్టీ సీనియర్‌ నేత యనమల కోరారు. రూ.కోటి 78లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెడితే రూ.48వేల కోట్లకు లెక్కల్లేవని ఆరోపించారు.

Yanamala ramakrishnudu comments on the financial manipulations
రాష్ట్ర ఆర్థిక అవకతవకలపై తెదేపా నేత యనమల ఆగ్రహం
author img

By

Published : Mar 26, 2022, 12:35 PM IST

రాష్ట్ర ఆర్థిక అవకతవకలపై తెదేపా నేత యనమల ఆగ్రహం

Yanamala comments on the financial manipulations: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై కేంద్రం జోక్యం చేసుకుని.. సీబీఐతో విచారణ జరిపించాలని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 360 ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు పెడితే.. రూ.48 వేల కోట్లకు లెక్కల్లేవని ఆరోపణలు చేశారు. లెక్కలు చెప్పలేకపోతే.. ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తేల్చాలన్నారు. స్పెషల్ బిల్లుల పేరుతో ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెబుతోందని.. స్పెషల్ బిల్లులనేవి ట్రెజరీ కోడ్‌లోనే లేదని యనమల అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు దిగమింగుతున్నారని మండిపడ్డారు.కేంద్రం జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రభుత్వం చెప్పుకున్న స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతుందేం లేదు. కోర్టుల తీర్పులపై సభలో చర్చలు పెడుతున్నారు.ఉభయ సభలను వాళ్ల సొంతానికి వాడుకుంటున్నట్టు కన్పిస్తోంది.కోర్టులను, చట్ట సభలను కూడా చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్​ సుమారు రూ. లక్ష కోట్లు తెచ్చారు.. దానికి సంబంధించిన లెక్కలు చెప్పలేదు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లెక్కలు కూడా బడ్జెట్ లెక్కల్లో చూపాలని 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసింది. 2024 నాటికి రూ. 8-9 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు విపరీతంగా పెరుగుతోంది. -యనమల రామకృష్ణుడు, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత

వైకాపా ప్రభుత్వంలో పీఏసీ వ్యవస్థ ఎందుకు సరిగా పని చేయడం లేదని యనమల ప్రశ్నించారు. పీఏసీ జరగనివ్వకుండా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చట్టాలు చేసే అధికారం లేదని కోర్టులు చెప్పకున్నా.. వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. చట్టాలు చేసే హక్కు చట్టసభలకు లేదని కోర్టు చెప్పలేదన్న యనమల.. మూడు రాజధానులపైనే చట్టం చేసే అధికారం లేదని మాత్రమే హైకోర్టు చెప్పిందని స్పష్టం చేశారు. స్పెషల్ బిల్లుల పేరుతో.. నిధులు మళ్లించేందుకే సీఎఫ్ఎంఎస్ విధానం లోపభూయిష్టమనే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.