ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ ప్రతిపాదిత రుణాలపై జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రతిపాదిత రుణంలో ఒక్క పైసా కూడా ఎక్కడికీ పోలేదని స్పష్టం చేసింది. ఏఐఐబీ ఉపాధ్యక్షుడితో ముఖ్యమంత్రి కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని.. ఎలాంటి అనుమానాలకు తావులేదని సీఎంవో స్పష్టం చేసింది. ఏపీకి సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీలు అంగీకారాన్ని తెలిపాయని వెల్లడించింది. విద్యుత్ సరఫరా ప్రాజెక్టుకు 100 మిలియన్ డాలర్లు, గ్రామీణ రోడ్లకు 400 మిలియన్ డాలర్లు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ద్య ప్రాజెక్టుకు 400 మిలియన్ డాలర్లను ఇప్పటికే ఏఐఐబీ మంజూరు చేసిందని ప్రభుత్వం వెల్లడించింది. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని.. ఈ రంగాల్లో రుణాలను ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఏఐఐబీలు సుముఖత వ్యక్తం చేశాయని ఆ మేరకు రుణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. అమరావతి రాజధాని ప్రాజెక్టులోని ఏడు ప్యాకేజీల్లో అక్రమాలు చోటు చేసుకున్నందున దానిపై విచారణ చేపట్టిన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీచదవండి