CABLE SHORT CIRCUIT: విజయవాడలోని దుర్గగుడికి వెళ్లే మార్గంలో ఉన్న ఫ్లైఓవర్ కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వైఫై కేబుల్ వైర్లు లాగుతున్న క్రమంలో.. రైలుకు విద్యుత్ సరఫరా చేసే తీగలు తగిలి మంటలు వచ్చాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు.. హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. కాగా.. మంటలు చెలరేగడంతో.. వైర్లు లాగే సిబ్బంది భయాందోళనతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ మంటల వల్ల ఎలాంటి ప్రమాదమూ జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.
అయితే.. ఆ మార్గంలో ప్రయాణించిన వాహనదారులు మంటలను చూసి ఆందోళనకు గురయ్యారు. నిత్యం వీఐపీలు తిరిగే మార్గం కావడంతో.. కాసేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్ధంకాక టెన్షన్ పడ్డారు. చివరకు మంటలు ఆర్పేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జాగ్రత్తలు తీసుకోకుండా వైఫై కేబుల్ వైర్లు లాగిన వ్యక్తులపై.. చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: