ETV Bharat / city

సీఎం క్యాంపు ఆఫీస్ ఎక్కడుండాలి ?: హైకోర్టు

అవసరం లేకుండా నిర్మించిన దాన్ని క్యాంపు ఆఫీసుగా భావించాలా అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో మరెక్కడా సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండకూడదనేలా పిటిషనర్లు కోరుతున్నట్లుందని ఏజీ బదులిచ్చారు. త్రిసభ్య ధర్మాసనం మరిన్ని ప్రశ్నలు సంధించగా సమయం కావాలని ఏజీ కోరారు. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలించకుండా చూడాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

సీఎం క్యాంపు ఆఫీస్ ఎక్కడుండాలి
సీఎం క్యాంపు ఆఫీస్ ఎక్కడుండాలి
author img

By

Published : Oct 7, 2020, 5:30 AM IST

సీఎం క్యాంపు కార్యాలయం విషయమై హైకోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. క్యాంపు కార్యాలయాలు ఎక్కడైనా ఉండొచ్చని అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ వాదించగా... అవసరం లేకుండా నిర్మిస్తే క్యాంపు కార్యాలయంగా భావించాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన నిబంధన సీఆర్డీఏ చట్టంలో ఉందా అని అడిగింది. సీఎం పనులను పరిమితం చేయొద్దని ఏజీ అనగా తామేమీ పరిమితం చేయడం లేదని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ, జ్యుడీషియరీ కార్యాలయాలు, సీఎం క్యాంపు ఆఫీస్, సచివాలయ కార్యాలయాలు, శాఖాధిపతుల కార్యాలయాలను రాజధాని అమరావతి నుంచి తరలించొద్దని వేసిన అనుబంధ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సీఎం క్యాంపు కార్యాలయం విషయంలో ఏజీ శ్రీరామ్ అభ్యంతరం లేవనెత్తారు. సీఎం క్యాంపు ఆఫీసుపై స్టే ఉత్తర్వులు వర్తింపజేయడంపై అభ్యంతరం ఉందన్నారు. రాజధాని పరిధిలోనే క్యాంపు కార్యాలయం ఉండాలనేమీ లేదన్నారు. సీఎం నెల్లూరు లేదా తిరుపతిలో కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చన్నారు.

పాలనా వికేంద్రీకరణ చట్టం నిబంధనల ప్రకారం సీఎం క్యాంపు ఆఫీసు తరలింపుపై నిషేధం లేదన్నారు. ఈ అంశంపై ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఏదైనా పని నిమిత్తం ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాల్సి వస్తే అక్కడ క్యాంపు ఆఫీసుగా పరిగణిస్తారన్న ధర్మాసనం అవసరం లేకుండా నిర్మించిన దాన్ని క్యాంపు ఆఫీసుగా భావించాలా అనే దానిపై స్పష్టత ఇవ్వాలంది. ఏజీ స్పందిస్తూ కేసుల విచారణ నిమిత్తం 15 రోజులు దిల్లీలో తాను ఉండాల్సి వస్తే... అక్కడ ఉండకూడదని నిలువరించడం సరికాదన్నారు. దిల్లీలో ఏపీ భవన్లో క్యాంపు ఆఫీసు ఉండగా మరొకటి నిర్మిస్తామనడం ఎంతవరకు సబబని కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఇక్కడకు రాకముందే సీఎం క్యాంపు ఆఫీసు ఇక్కడ ఉందని ఏజీ అన్నారు. రాయలసీమ ఎత్తి పోతల పనుల పరిశీలనకు సీఎం అక్కడికి వెళ్లి 15 రోజులు ఉండవచ్చు అన్నారు. సీఎం సర్క్యూట్ హౌస్‌లోనే ఉండాలనేలా పిటిషనర్ అభ్యర్థన ఉందన్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు రాజధాని ప్రాంతంలో లేదన్నారు. రాష్ట్రంలో మరెక్కడా సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండకూడదనేలా పిటిషనర్లు కోరుతున్నట్లుందన్నారు.

పాలనా వికేంద్రీకరణ చట్టం కంటే ముందు ప్రస్తుతం ఉన్న సీఎం ఆఫీస్ కాకుండా రాష్ట్రంలో ఇంకేమైనా క్యాంపు కార్యాలయాలున్నాయా అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం ఉన్నది రెసిడెన్స్ కమ్ క్యాంప్‌ ఆఫీసు అని ఏజీ బదులిచ్చారు. సీఎం ఎక్కడుండి పనిచేస్తే అదే క్యాంపు ఆఫీసుగా పరిగణించాలన్నారు. 15, 20 రోజులు తాత్కాలికంగా ఉండే విషయం గురించి కాదన్న ధర్మాసనం సీఎం కోసం ఇతర ఆఫీసులను ప్రభుత్వం ఏమైనా నిర్మించిందా? అని ప్రశ్నించింది. వివరాలు సమర్పించేందుకు ఏజీ సమయం కావాలన్నారు. పూర్వ సీఎం రెండు క్యాంప్ ఆఫీస్‌లు కలిగి ఉన్నారన్నారు ఒకటి హైదరాబాద్, మరొకటి సొంత గ్రామంలో అన్నారు. రెండు రోజుల్లో కౌంటర్ వేస్తానన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ కార్యాలయాల విషయంలోనూ ఏజీ కౌంటర్ వేస్తామన్నారు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఈ వ్యవహారంపై శుక్రవారం విచారణ చేపడతామని పేర్కొంది.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల బ్లూ కాపీ, రిజిస్టర్లను కోర్టుకు ఇచ్చేలా ఆదేశించాలని మరో అనుబంధ పిటిషన్‌ దాఖలైనట్టు ధర్మాసనం తెలిపింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ జరుపుతామంది. మండలి ఛైర్మన్ సిఫారసు చేసినట్లు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో బులెటిన్ విడుదల చేయాలని, మండలి కార్యకలాపాల వీడియో ఫుటేజి కోర్టు ముందు ఉంచాలని అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయని ధర్మాసనం తెలిపింది. న్యాయవాది జంధ్యాల రవిశంకర్ స్పందిస్తూ సభలో విషయాలను కోర్టు పరిశీలించాలనే ఫుటేజీ సమర్పించాలని కోరామన్నారు. వాటిని ఎలా తారుమారు చేస్తారో తనకు తెలుసన్నారు. ఆ వాదనలపై ఏజీ అభ్యంతరం తెలిపారు. శాసనకర్తల గురించి కోర్టులో అలా మాట్లాడటం సరికాదన్నారు. దీనిపై విచారణ ఈనెల 9న చేపడతామని ధర్మాసనం తెలిపింది. బిల్లుకు సంబంధించిన ఫైళ్లను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.

సాక్షి కథనంపై ఏజీ దృష్టికి

సుప్రీంకోర్టును ఉద్దేశించి తాము వ్యాఖ్యలు చేశామంటూ సాక్షి పత్రికలో మంగళవారం వచ్చిన కథనం గురించి ఏజీతో ధర్మాసనం ప్రస్తా వించింది. ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తునట్లు తెలిపింది. విచారణలో చోటుచేసుకోని వాటిని ప్రచురించడం సరికాదంది. ఏజీ స్పందిస్తూ తాను కథనాన్ని పరిశీలిస్తానన్నారు. మిస్ రిపోర్ట్ కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయవాది వై నాగిరెడ్డి స్పందిస్తూ హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని ఓ పత్రిక అసత్య కథనం ప్రచురించిందన్నారు.

సీల్డ్ కవర్​లో ఫైళ్లు ఇవ్వండి

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఫైళ్లను కోర్టు పరిశీలించేందుకు సీల్డ్ కవర్లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ ఫైళ్లలో గోప్యత లేదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు కోర్టు ముందు ఉంచుతామని ఏజీ తెలిపారు విచారణ బుధవారానికి వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.