లాక్‌డౌన్ సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు ఆటంకం కలగకుండా చూడాలని పేర్కొంటూ కేంద్రమిచ్చిన ఆదేశాల అమలుకు ఏం చేస్తున్నారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై కౌంటర్ వేయాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. పారిశుద్ధ్యం అంశంలో తీసుకున్న చర్యల వివరాలను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. మరోవైపు..... విశ్రాంత ఉద్యోగులకు ప్రస్తుతం సగం పింఛనే ఇవ్వాలన్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వాన్నిధర్మాసానం వివరణ కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. సగం పింఛన్ చెల్లించాలని జారీ అయిన జీవో లోని ఆ భాగాన్ని సవాలు చేస్తూ న్యాయవాది రవిశంకర్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా తీసుకుంది
ఇదీ చూడండి కరోనా కట్టడికి జిల్లాకు రూ.1000 కోట్లు కేటాయించాలి'