ETV Bharat / city

గోవుల మృతికి కారణాలేంటి...?

తాడేపల్లి గోశాలలో జరిగిన మూగజీవాల మృత్యుఘోష వెనుక కారణాలు అంతుచిక్కడం లేదు.ఆవుల మృతి వెనుక కుట్ర కోణం ఉందా? లేక పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నట్లు గడ్డిపైనున్న ప్రమాదకరమైన రసాయనాల వల్లే ఆవులు చనిపోయాయా ? అన్నది తేలాల్సి ఉంది.పూర్తిగా స్పష్టత రావాలంటే మాత్రం... ఫోరెన్సిక్ నివేదిక వచ్చేవరకూ ఆగాల్సిందే !

author img

By

Published : Aug 12, 2019, 5:27 AM IST

గోవుల మృతికి కారణాలేంటి...?

విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో జరిగిన మూగజీవాల మృత్యుఘోష వెనుక కారణాలు అంతుచిక్కడం లేదు. పశుగ్రాసం పైనున్న రసాయనాలే కారణమని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నా...పక్కాగా నిర్ధరణ జరగలేదు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.

కుట్రకోణం దాగి ఉందా..?

ఆవుల మృతి వెనుక కుట్ర కోణం ఉందా? లేక పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నట్లు గడ్డిపైనున్న ప్రమాదకరమైన రసాయనాల వల్లే ఆవులు చనిపోయాయా ? అన్నది తేలాల్సి ఉంది. దాణాలో యూరియా వంటి ఎరువులు, ఇతర రసాయనాలు అధిక మోతాదులో కలిసినందునే మృతి చెందాయని అధికారులు భావిస్తున్నారు. అయితే మంగళవారం శవపరీక్ష నివేదిక వచ్చాకే స్పష్టత రానుంది. పూర్తిగా స్పష్టత రావాలంటే మాత్రం... ఫోరెన్సిక్ నివేదిక వచ్చేవరకూ ఆగాల్సిందే. అందుకోసం మరో నాలుగైదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ నివేదిక ఆధారంగా ఏ రసాయనం, ఎంత మోతాదులో కలిసిందనేది స్పష్టంగా తెలియనుంది.

రసాయన ఎరువులే కారణమా ?

జొన్న గడ్డి కోసుకొచ్చిన వెంటనే తినకూడదని, కనీసం ఒక రోజు నిల్వ ఉంచితేనే దానిపైన ఉండే రసాయనం పోతుందని పశు వైద్యులు వెల్లడించారు. గడ్డిపై యూరియా మోతాదు అధికంగా ఉందా లేక కత్తెర పురుగు నివారణకు వాడే రసాయన ఎరువులు కారణమా అన్నదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే గోశాల అపరిశుభ్రంగా ఉండటం వల్ల ఇబ్బంది కలిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు... డ్రోన్లు, ఫాల్కనో వాహనంతో గోశాలను చిత్రీకరించారు.

ఆహారం అందడం లేదు..
ఒకేచోట పెద్దసంఖ్యలో పశువులు ఉండటం వల్ల సరైన ఆహారం అందడం లేదని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల ఇక్కడున్న వాటిలో కొన్నింటిని ప్రభుత్వం ఆధ్వర్యాన రైతులకు అందజేయాలని నిర్ణయించామన్నారు. అలాగే గోవులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

గోవుల మృతికి కారణాలేంటి...?

ఇదీచదవండి

ఆ వంద గోవుల మృతిపై అనుమానాలెన్నో!

Intro:Ap_vja_15_26_Food_Safty_dpt_Raids_av_C10
Sai babu_ Vijayawada : 9985129555
యాంకర్ : విజయవాడ నగర పరిధిలోని పలు ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్ల నేతృత్వంలో ఆహారభద్రత , తూనికలు కొలతలు శాఖ అధికారులతో నాలుగు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల్లో కనీసం నిబంధనలు పాటించకపోవడాన్ని గుర్తించిన అధికారులు తయారీదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఐస్ క్రీమ్ తయారీ అయినా బాక్సులపై ఎటువంటి తయారీ తేదీలను ముద్రించకపోవడం,తయారీ కేంద్రాలలో కనీస శుభ్రత పాటించకపోవడం పై జేసి కృత్తిక శుక్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ తనిఖీల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లోని ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై కేసులు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేయనున్నట్లు జేసీ తెలిపారు. ఈ దాడుల్లో ఆహార భద్రతా శాఖ ప్రాంతీయ అధికారి పూర్ణ చంద్రరావు ,తునికలు కొలతల శాఖ అధికారులు పాల్గొన్నారు..
బైట్ : కుర్తికా శుక్ల.. జాయింట్ కలక్టర్
బైట్ : పూర్ణ చంద్రరావు.. ఆహార భద్రతా శాఖ ప్రాంతీయ అధికారి..

Body:Ap_vja_15_26_Food_Safty_dpt_Raids_av_C10

Conclusion:Ap_vja_15_26_Food_Safty_dpt_Raids_av_C10
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.