వైకాపా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకహోదాపై ప్రస్తావించకపోవటం బాధాకరమని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన... ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ఒకే ఒక్క ప్రభుత్వం తెదేపాది అని అన్నారు. మోదీ,కేసీఆర్ కనుసన్నల్లో జగన్ నడుసున్నారని ఆక్షేపించారు. పోలవరం, అమరావతిపై... వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొనకపోవటం శోచనీయమన్నారు.
ఇదీ చదవండి