ETV Bharat / city

నవోదయ విద్యార్థులందరు ఒకేచోట.. పోర్టల్ రూపొందించిన పూర్వ విద్యార్థులు

author img

By

Published : Dec 25, 2020, 10:58 PM IST

దేశంలో ఉన్న 661 నవోదయ పాఠశాలలు, పూర్వ విద్యార్థులందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా తొలిసారి ఓ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. అనంతపురం, తెలంగాణలోని ఆదిలాబాద్​కు చెందిన ఇద్దరు పూర్వ విద్యార్థులు ఈ వెబ్​పోర్టల్​ను రూపొందించారు. నవోదయ విద్యార్థులకు మారదర్శకత్వం, ఉద్యోగాలు, వైద్యం, వ్యాపారం ఇలా.. అన్ని విషయాల్లోనూ సహకారం అందిస్తామని పోర్టల్​ రూపకర్తల్లో ఒకరైన పద్మజ తెలిపారు.

web portal started connecting all batches belonging to navodaya schools
నవోదయ విద్యార్థులందరు ఒకేచోట.. పోర్టల్ రూపొందించిన పూర్వ విద్యార్థులు

దేశంలో ఉన్న 661 నవోదయ పాఠశాలలు, పూర్వ విద్యార్థులందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా తొలిసారి ఓ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. అనంతపురం జిల్లాకు చెందిన జవహర్‌ నవోదయ విద్యాలయం పూర్వ విద్యార్థిని పద్మజ, తెలంగాణలోని ఆదిలాబాద్‌ జేఎన్‌వీ పూర్వ విద్యార్థి వినీల్‌కుమార్‌ నేతృత్వంలో ఈ వెబ్‌పోర్టల్‌ను రూపొందించారు. నవోదయ విద్యాలయ సమితి కమిషనర్‌ వినాయక్‌గార్గ్‌ ఈ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించారు. అంతర్జాలంలో వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవిదేశాల్లో స్థిరపడిన నవోదయ పాఠశాలల పూర్వవిద్యార్థులు, ఎన్‌వీఎస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆదిత్య ప్రకాష్‌సింగ్, ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్లు పాలొన్నారు. దేశంలోని అన్ని జేఎన్‌వీలను అనుసంధానించేందుకు ఈ వెబ్‌పోర్టల్‌ ఉపయోగపడుతుందని పద్మజ అన్నారు.

పూర్వవిద్యార్థులతో అనుసంధానించడమే లక్ష్యం

ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 2.65లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వీరందరినీ పూర్వవిద్యార్థులతో అనుసంధానించడమే లక్ష్యంగా ప్రారంభించినట్టు వారు తెలిపారు. ఈ పోర్టల్‌లో అన్ని పాఠశాలల పూర్వ విద్యార్థుల సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. నవోదయ విద్యార్థులు ప్రస్తుతం దేశవిదేశాల్లో అనేక ఉన్నత పదవుల్లో ఉన్నారని తెలిపారు. వారందరి సహకారం ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులకు అందజేస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, విభిన్న వ్యక్తుల సమూహంగా http://www.nvsalumni.com/ వెబ్‌పోర్టల్‌ నిలవబోతోందని పేర్కొన్నారు.

నవోదయ విద్యార్థులకు మారదర్శకత్వం, ఉద్యోగాలు, వైద్యం, వ్యాపారం ఇలా.. అన్ని విషయాల్లోనూ సహకారం అందిస్తామని పద్మజ తెలిపారు.

ఇదీ చదవండి:

విద్యుదాఘాతంతో బాలుడికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.