అల్పపీడనంతో పాటు తూర్పు-పశ్చిమ షియర్ జోన్ల కారణంగానూ కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణా, యానాంలలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఈ నెల 20, 21 తేదీల్లో వర్ష ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఉంటుందని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలోని ఉభయ గోదావరి, ఉత్తర కోస్తాలోని విశాఖ తదితర జిల్లాల్లోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి.
ఇవాళ నమోదైన వర్షపాతం వివరాలు
ప్రాంతం పేరు | వర్షపాతం(సెంటిమీటర్లలో..) |
రాజమహేంద్రవరం | 6.8 |
కొవ్వూరు | 6.6 |
కోరుకొండ | 6.5 |
ఎస్.రాయవరం | 6.4 |
గుంటూరు జిల్లా బొల్లాపల్లె | 6.1 |
ప్రకాశం జిల్లా ఉలవపాడు | 5.1 |
కర్నూలులోని కృష్ణగిరి | 4.7 |
విజయనగరం జిల్లాల జియ్యమ్మవలస | 4.2 |
చీమకుర్తి | 4 |
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు | 3.7 |
తాడేపల్లి గూడెం | 3.3 |
శ్రీకాకుళం రేగిడిమాదాలవలస | 3.2 |
కృష్ణా జిల్లా విస్సన్నపేట | 2.2 |
విశాఖ | 1.6 |
ఒంగోలు | 1.5 |
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
ప్రాంతం పేరు | డిగ్రీల సెల్సియస్ |
విజయవాడ | 37 |
విశాఖపట్నం | 35 |
తిరుపతి | 35 |
అమరావతి | 37 |
విజయనగరం | 38 |
నెల్లూరు | 33 |
గుంటూరు | 36 |
శ్రీకాకుళం | 36 |
కర్నూలు | 31 |
ఒంగోలు | 35 |
ఏలూరు | 38 |
కడప | 32 |
రాజమహేంద్రవరం | 40 |
కాకినాడ | 37 |
అనంతపురం | 33 |