ETV Bharat / city

VRAS PROTEST: వేతనాలు పెంచాలంటూ... వీఆర్ఏల నిరసన

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలు జిల్లాలో వీఆర్ఏలు నిరసన చేపట్టారు. కనీస వేతనం 21 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూఫ్ 4 ఉద్యోగులుగా గుర్తించాల‌ని, అర్హులైన వారికి వాచ్‌మెన్‌, అటెండ‌ర్ త‌దిత‌ర పోస్టులు ఇవ్వాల‌ని, నామినీలుగా ప‌నిచేస్తున్న వారి పిల్ల‌ల‌ను రెగ్యుల‌ర్ చేయాల‌ని కోరారు.

వేతనాలు పెంచాలని వీఆర్ఏల నిరసన
వేతనాలు పెంచాలని వీఆర్ఏల నిరసన
author img

By

Published : Jul 12, 2021, 9:42 PM IST

అనంతపురం జిల్లాలో..

ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. కనీస వేతనం 21 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ఉషారాణికి సమర్పించారు.

గుంటూరు జిల్లాలో..

తమకు రూ 21 వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ గ్రామ రెవెన్యూ సేవకుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వీఆర్ఏలకు మద్దతుగా అన్ని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. త‌మ‌ను గ్రూఫ్ 4 ఉద్యోగులుగా గుర్తించాల‌ని, అర్హులైన వారికి వాచ్‌మెన్‌, అటెండ‌ర్ త‌దిత‌ర పోస్టులు ఇవ్వాల‌ని, నామినీలుగా ప‌నిచేస్తున్న వారి పిల్ల‌ల‌ను రెగ్యుల‌ర్ చేయాల‌ని వారు డిమాండ్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు నిరసన వ్యక్తం చేశారు. తమ వేతనాన్ని 21 వేలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 1,578 కరోనా కేసులు, 22 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.