నాడు ప్రతిపక్ష హోదాలో వీఆర్ఏల ఉద్యమానికి మద్దతు పలికిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకడపోవడం బాధాకరమని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు చలో రాజధానిలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసనకు సూర్యనారాయణ సంఘీభావం తెలిపారు.
13జిల్లాల నుంచి ఆందోళనలో పాల్గొన్న వీఆర్ఏలు.. కనీస వేతనం రూ.21వేలు, ప్రమోషన్లు, ఇవ్వాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. 2017లో తమ ధర్నాకు మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తలరాత మారుస్తా అన్నారు...కానీ అధికారంలోకి వచ్చి వాలంటీర్ వ్యవస్థ తెచ్చి మా తలరాత తలకిందులు చేశారని వీఆర్ఏ సంఘం అధ్యక్షులు పెద్దన్న ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: