ETV Bharat / city

దుర్గగుడిలో వీఐపీ సిఫారసులు రద్దు... పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం - దుర్గమ్మ

indrakeeladri
మహాలక్ష్మి అలంకరణలో దుర్గమ్మ
author img

By

Published : Oct 1, 2022, 4:39 PM IST

Updated : Oct 2, 2022, 6:55 AM IST

16:35 October 01

vijayawada indrakeeladri

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఈ ఆరురోజులు ఒక తరహాలో ఉత్సవాలు సాగితే... అర్ధరాత్రి నుంచి మూలానక్షత్రం సందర్భంగా దర్శనాలకు వచ్చే వారి సంఖ్య భారీగా ఉండబోతుండటం... అధికారులకు సవాల్‌గా మారనుంది. గత రెండేళ్లపాటు కొవిడ్‌ కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులు దసరా వేళ అమ్మవారి ఆలయానికి రాగా.. ఈసారి కొవిడ్‌ ఆంక్షలు లేని సమయంలో సాధారణ రోజుల కంటే నాలుగింతలు అధికంగానే వచ్చే అవకాశం ఉంది. భక్తులు సర్వస్వతీదేవి అలంకరణలో ఆదిపరాశక్తిని దర్శించుకునేందుకు భారీగా వస్తారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వీఐపీలతో సహా దివ్యాంగులు, వృద్ధులు కొండపైకి వచ్చి ఇబ్బందులు పడొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరినీ సర్వదర్శనాలకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇవాళ అమ్మవారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

మహాలక్ష్మిదేవి అలంకరణలో..

బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు మహాలక్ష్మిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న జగన్మాతకు మనస్ఫూర్తిగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులు బారులు తీరారు. సమస్త జీవుల్లోనూ ఉండే లక్ష్మి స్వరూపం దుర్గాదేవి కావున దసరా వేడుకల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి సర్వమంగళకారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన భాగ్యాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్ముతారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సీతమ్మపాదాల వద్ద భక్తుల సౌకర్యార్థం జలవనరులశాఖ నుంచి నాలుగున్నర ఎకరాల స్థలాన్ని దేవాదాయశాఖ లీజుకు తీసుకోబోతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ స్థలంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టబోమని... భక్తుల సౌకర్యార్థం ఆ ప్రదేశాన్ని వినియోగిస్తామన్నారు. స్థలం కేటాయింపుపై మంత్రి అంబటిరాంబాబు లిఖితపూర్వక ఆదేశాలిచ్చారని చెప్పారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూలానక్షత్రం రోజున సుమారు రెండులక్షల మందివరకూ భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. సరస్వతీదేవి అలంకరణలో మూలానక్షత్రం రోజు అర్థరాత్రి రెండు గంటల నుంచి దర్శనాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. మూలానక్షత్రం దర్శనం ఏర్పాట్లపై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు మాట్లాడారు.

"మూల నక్షత్రం రోజు 3 లక్షల మంది భక్తులు రావచ్చు. దుర్గగుడిలో అర్ధరాత్రి 1.30 నుంచి దర్శనాలకు అనుమతిస్తాం. రేపు దుర్గగుడిలో వీఐపీ సిఫారసులు ఉండవు. రేపు దుర్గగుడిపైకి వాహనాలకు అనుమతి లేదు. రేపు అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాలే. సీఎం రేపు మధ్యాహ్నం 3 గంటలకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు." -కలెక్టర్ దిల్లీరావు

సీపీ కాంతిరాణా టాటా: రాత్రి 12 నుంచే క్యూలైన్ల దగ్గర బందోబస్తు ఉంటుందని సీపీ కాంతిరాణా టాటా తెలిపారు. రేపు 5 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హోల్డింగ్ ఏరియా పాయింట్ వీఎంసీ దగ్గర ఉంచుతున్నామని స్పష్టం చేశారు. పోలీస్ కంట్రోల్‌రూమ్, కుమ్మరిపాలెం నుంచి ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సీపీ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 2, 2022, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.