విజయవాడ చిట్టినగర్ కూడలిలో మంగళవారం హంగామ సృష్టించిన ఇద్దరు యువకులపై టూ టౌన్ కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనాన్ని నడిరోడ్డుపై వేగంగా కిందపడవేసి తిప్పుతూ..మద్యం సీసాలను రోడ్డుపైనే పగులగొట్టారు. ఈ పరిణామంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. మంత్రి వెల్లంపల్లి పర్యటనలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్.. యువకులపై స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ద్విచక్రవాహనంతో యువకుల హల్ చల్.. అరెస్టు చేసిన పోలీసులు - విజయవాడలో ద్విచక్రవాహనంతో యువకుల హల్ చల్
విజయవాడలో ఇద్దరు యువకులు మంగళవారం రెచ్చిపోయారు. ద్విచక్రవాహనాలతో రోడ్డుపై విన్యాసాలు చేస్తూ..హల్చల్ చేశారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.
ద్విచక్రవాహనంతో యువకుల హల్ చల్