ETV Bharat / city

ఆనందాన్ని ఇస్తామంటారు... అందినకాడికి దోచేస్తారు! - విజయవాడ తాజా వార్తలు

ఇంట్లో ఒంటరిగా ఉండి బోర్ కొడుతుందా ?.. మీరు ఆనందాన్ని కోరుకుంటున్నారా ?.. అయితే ఇక్కడ క్లిక్ చేస్తే చాలు మీరు కోరుకున్న ఆనందం మీ చెంతకు వస్తుంది అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తారు. క్లిక్ చేశారో మాటలతో కలిపి మత్తెకిస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని నగ్నంగా చూడాలని ఉందని రెచ్చగొట్టి ఉచ్చులోకి లాగుతారు. ఆ తరువాత బెదిరిస్తూ డబ్బులు దోచేస్తారు. తాజాగా ఇలాంటి ఫిర్యాదులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్​కు వరుసగా అందుతున్నాయి.

cyber crime
cyber crime
author img

By

Published : Dec 14, 2020, 8:35 PM IST

సామాజిక మాధ్యమాలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉపయోగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. వినోదం కల్పిస్తామంటూ అందమైన యువతుల ఫొటోలతో ప్రకటనలు ఇస్తున్నారు. యువకులను మెల్లగా ముగ్గులోకి దించి.. ఆ తర్వాత నగదు కోసం బెదిరిస్తున్నారు. వారి బాధితులు విజయవాడలోనూ పెరుగుతున్నారు.

ఫేస్ 'బుక్'

విజయవాడ నగరానికి చెందిన యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. నిత్యం ఫేస్​బుక్​ను వినియోగిస్తుంటాడు. మీకు ఆనందం కావాలంటే మాకు కాల్ చేయండి అని అందమైన యువతి ఫొటోతో ఉన్న ప్రకటన చూశాడు. వెంటనే అందులోని నంబర్​కు ఫోన్ చేశాడు. అవతలి వైపు ఓ యువతి మత్తెక్కించే గొంతుతో మాట్లాడింది. కొద్ది రోజులు వాట్సాప్ కాల్స్, ఛాటింగ్​లు చేసుకున్నారు. సదరు యువతి ఓ రోజు వీడియో కాల్ చేసి తన ప్రైవేట్ భాగాలను చూపించి.. యువకుడిని రెచ్చగొట్టింది. బాధితుడు సైతం నగ్నంగా వీడియో ఛాట్ చేశాడు. కాసేపటికే కాల్ కట్ అయింది. తరువాత అతని వాట్సాప్​కు ఓ సందేశం వచ్చింది. 'నేను చెప్పిన అకౌంట్​కు రెండు వేల రూపాయలు పంపకపోతే వీడియో ఛాట్​ను మీ స్నేహితులు, బంధువులకు సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతాం' అని బెదిరించారు. భయపడిపోయిన బాధితుడు సదరు ఖాతాకు నగదు పంపాడు. విడతల వారీగా నగదు డిమాండ్ చేయటంతో విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫేస్​బుక్, గూగుల్ ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో నాలుగు ఫిర్యాదులు అందాయని వెెల్లడించారు.

ప్రకటనలతో మోసపోకండి

బాధితుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు దొరక్కుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చరవాణిలో మొదట సిమ్ వేసి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అనంతరం సిమ్ తీసేసి డేటా వినియోగించి వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ చేస్తున్నారు. అనవసరమైన ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. వీడియో కాల్ చేసేటప్పుడు 'స్క్రీన్ రికార్డ్' చేయవచ్చన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండాలి- శ్రీనివాసరావు, సైబర్ క్రైమ్ ఇన్​స్పెక్టర్

ఇదీ చదవండి

పోలవరం ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గదు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.