ETV Bharat / city

తందూరి చాయ్...తాగితే వదలరోయ్.! - కృష్ణా జిల్లా వార్తలు

ఉదయం నిద్రనుంచి మేల్కొనగానే ప్రతి ఒక్కరూ తాగేది చాయ్. పని ఒత్తిడిలో రిలీఫ్‌ కోసం, తలనొప్పి నుంచి ఉపశమనం కోసం కూడా టీ తాగుతారు. ఇందులో అల్లం చాయ్, ఇరానీ చాయ్, మసాల చాయ్ లాంటి వెరైటీలున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మరో రకం చాయ్ ఆకట్టుకుంటోంది. విజయవాడలో తందూరి చాయ్ కస్టమర్లను క్యూ కట్టిస్తోంది.

vijayawada-residents-enjoy-the-taste-of-tandoori-chai
తందూరి చాయ్
author img

By

Published : Sep 29, 2020, 8:34 AM IST

విజయవాడలో తందూరి చాయ్

ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగి... తమ దినచర్యను మొదలు పెడుతూ ఉంటారు. కానీ తందూరి చాయ్ పేరుతో మట్టికుండలో కాసిన టీని, మట్టి గ్లాసులో తాగితే ఆ రుచి వర్ణించడానికి వీలు కాదంటారు టీ ప్రేమికులు. విజయవాడ సత్యనారాయణ పురంలో ఓ యువకుడు తందూరి చాయ్ పేరుతో దుకాణాన్ని తెరిచాడు. ఉత్తర భారతదేశంలో ఎంతో పేరున్న ఈ తందూరి చాయ్ విజయవాడ వాసులకు రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

తందూరి రోటి, తందూరి చికెన్ లాంటి పేర్లు విన్నాం.. వాటి టేస్ట్ కూడా చూశాం. తాజాగా తందూరి జాబితాలోకి మరో సరికొత్త ఐటమ్ చేరింది. అదే తందూరి చాయ్. తందూరి చాయ్‌ రుచే వేరంటున్నారు టీ ప్రియులు. మట్టిగ్లాసుల్లో టీ తాగితే వచ్చే మజా మాటల్లో వర్ణించలేమంటున్నారు. మట్టి పాత్రలను ఉపయోగించడం ద్వారా పర్యావరణంతోపాటు శరీరానికి కూడా మేలు జరుగుతోందని చెబుతున్నారు. ఇఫ్పటివరకు చాయ్‌ని ప్లాస్టిక్ లేదా గాజు గ్లాసులలో తాగిన విజయవాడ జనం ప్రస్తుతం ఇలా మట్టి గ్లాసులో తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

దూద్ దురంతో రైలు ద్వారా దిల్లీకి 3 కోట్ల లీటర్ల పాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.