సెల్ ఫోను లేకుండా రోజు గడవని పరిస్థితి. అటువంటి సెల్‌ఫోను రిపేర్ అయితే.. అసలే లాక్డౌన్, పైగా కరోనా భయం. ఇలాంటి సమయంలో రిపేర్ షాపులు లేక వినియోగదారులకు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది.
రాష్ట్రమంతటికీ ముడిసరకు సరఫరా అయ్యే విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ మూతపడటం ఓ కారణం. కరోనా ఎలక్ట్రానిక్స్ వస్తువులు, స్పేర్ పార్ట్స్ మార్కెట్‌ను కుదేలు చేసింది. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరకు రవాణా జరిగే విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ బఫర్ జోన్ పరిధిలో ఉండటం వల్ల దుకాణాలు తెరుచుకోని పరిస్థితి నెలకొంది.
ఫలితంగా ఇతర జిల్లాలపైనా ఈ ప్రభావం పడుతుంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్ పరికరాలు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. వ్యాపారం లేక భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని దుకాణ యజమానులు వాపోతున్నారు. ఆన్లైన్ మార్కెట్ దెబ్బతో తీవ్రంగా నష్టపోతున్నా తమను కరోనా మరింత దెబ్బతీసిందని అంటున్నారు. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై అమరావతి డిజిటల్ ఎలక్ట్రానిక్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఈటీవీ భారత్ మాట్లాడింది.
ఇదీ చదవండి: