విజయవాడ నగర పాలక సంస్థ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ముహూర్తం ప్రకారం నగర పాలక సంస్ధ కార్యాలయంలోని ఛాంబర్లో బాధ్యతలు తీసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరై నూతన మేయర్‌ను అభినందించారు.
విజయవాడ నగరంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి దస్త్రాలపై రాయన భాగ్యలక్ష్మి తొలి సంతకం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించడమే తన లక్ష్యమన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో విజయవాడ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో తామంతా కృషి చేస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చదవండి: