జగజ్జననీ, లోకమాత, విజయవాడ కనకదుర్గమ్మ పూజలు అమెరికాలో ప్రారంభమయ్యాయి. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలోని నలుగురు సీనియర్ పండితులు.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. పది ప్రాంతాల్లో దుర్గమ్మ పూజలు నిర్వహిస్తారు. రాష్ట్ర దేవాదాయశాఖ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆలయాల సలహాదారులు చెన్నూరి వెంకటసుబ్బారావు ఈ పూజలను పర్యవేక్షిస్తున్నారు. దుర్గగుడి ప్రధాన పూజారి శంకర్ శాండిల్య ఆధ్వర్యంలో పండితులు పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రతీ పట్టణంలోనూ మూడు రోజులపాటు అమ్మవారి పూజలు నిర్వహించనున్నారు. కుంకుమార్చన, శ్రీచక్ర పూజ, నవ వరావరణ పూజ, లలిత సహస్ర నామ పూజలతో పాటు శివపార్వతి కల్యాణం, చండీ హోమం వంటి పూజలు ఆయా ఆలయాల పద్ధతుల ప్రకారం జరపనున్నారు. అమెరికాలోని మిల్సిటాస్ పట్టణంలో అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు.
ఇవీ చదవండి: