విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన ఇవాళ అమ్మవారు శ్రీమహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవతగా మహాలక్ష్మిదేవిని భక్తులు భావిస్తారు. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేశారు. శ్రీమహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అమ్మవారుగా భక్తులను అనుగ్రహిస్తారు.
ఇదీచదవండి