ETV Bharat / city

విజయవాడ సీపీ బదిలీ

రాష్ట్రంలో 17 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. విజయవాడ అదనపు పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులును పోలీసు కమిషనర్‌గా నియమించింది. ప్రస్తుతం పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సీహెచ్‌ ద్వారకా తిరుమలరావును జీఆర్పీ (ప్రభుత్వ రైల్వే పోలీస్‌) విభాగ డీజీపీగా బదిలీ చేశారు.

విజయవాడ కొత్త పోలీసు కమిషనర్‌గా శ్రీనివాసులు

author img

By

Published : Jun 14, 2020, 7:23 AM IST

రాష్ట్రంలో 17 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. విజయవాడ కమిషనరేట్‌ సహా మొత్తం ఆరు పోలీసు యూనిట్లకు కొత్త అధిపతులను నియమించింది. విశాఖ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న శాంతిభద్రతల విభాగం డీసీపీలు ఇద్దరినీ ఆ పోస్టుల నుంచి తప్పించింది. వీరిలో ఒకరికి పోస్టింగు ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. శ్రీకాకుళం, విశాఖ గ్రామీణ, పశ్చిమగోదావరి, గుంటూరు గ్రామీణ, గుంటూరు అర్బన్‌ ఎస్పీలుగా ఇప్పటివరకూ పనిచేస్తున్న వారిని ఆయా స్థానాల్లో నుంచి మార్చింది. వారిలో శ్రీకాకుళం ఎస్పీగా పనిచేసిన ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డిని మాత్రమే మళ్లీ మరో జిల్లా ఎస్పీగా నియమించింది. గుంటూరు అర్బన్‌కు ఇన్‌ఛార్జి ఎస్పీగా వ్యవహరిస్తున్న పీహెచ్‌డీ రామకృష్ణకు డీఐజీగా పదోన్నతినిచ్చి ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో డైరెక్టర్‌ బాధ్యతలను అప్పగించింది. విజయవాడ అదనపు పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులును పోలీసు కమిషనర్‌గా నియమించింది. 2014 బ్యాచ్‌కు చెంది ఇటీవలే ఎస్పీలుగా పదోన్నతి పొందిన బి.కృష్ణారావు, అమిత్‌బర్దార్‌లను తొలిసారిగా జిల్లా ఎస్పీలుగా నియమించింది. గతంలో వివిధ జిల్లాల్లో ఎస్పీలుగా పనిచేసి ప్రస్తుతం ఇతర విభాగాల్లో ఉన్న విశాల్‌ గున్ని, నారాయణ నాయక్‌లకు జిల్లా ఎస్పీలుగా మరోసారి బాధ్యతలను అప్పగించింది. దిశ ప్రత్యేకాధికారిణి ఎం.దీపికకు ప్రస్తుతమున్న స్థానంతో పాటు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ఇచ్చింది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.