ETV Bharat / city

మొగల్రాజపురం దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

author img

By

Published : Sep 17, 2020, 7:15 PM IST

విజయవాడ మొగల్రాజపురం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. రూ.48.50 లక్షలు చోరీ జరిగిందని వైద్యుడు మురళీధర్ ఫిర్యాదు చేశారని నగర సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులున్నారన్న విజయవాడ సీపీ...క్యాటరింగ్‌ నాగేంద్ర, పీఆర్వో మెండెం విజయ్ చోరీకి కుట్ర పన్నారని వివరించారు. తాడేపల్లికి చెందిన నేరస్థులతో కలిసి దోపిడీ చేశారని చెప్పారు. ఈ చోరీ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశామన్న సీపీ శ్రీనివాసులు... రూ.34.75 లక్షలు, 48 గ్రాముల బంగారం రికవరీ చేసినట్టు వివరించారు.

Vijayawada CP press meet over Mogalrajapuram Robbery
మొగల్రాజపురం దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

ఈనెల 14న విజయవాడ మొగల్రాజపురంలోని వైద్యుడు మురళీధర్ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 48.50 లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని వైద్యుడు మురళీధర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నగర సీపీ బి.శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులున్నారన్న సీపీ... క్యాటరింగ్ నాగేంద్ర, పీఆర్వో మెండెం విజయ్, తాడేపల్లికి చెందిన నేరస్థులతో కలిసి దోపిడికి పాల్పడినట్లు సీపీ తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. 34.75 లక్షల రూపాయల నగదు, 48 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు నగర కమిషర్ తెలిపారు. చోరీ చేసిన వారిలో వెస్లీ అనే వ్యక్తికి నేర చరిత్ర ఉందన్నారు. ప్రతీ నెల లక్షల్లో బ్యాంకు ఈఎంఐలు కట్టాలని డాక్టర్ తెలిపినట్లు సీపీ తెలిపారు. మొత్తం బిల్డింగ్ మరమ్మత్తులు జరిగిన తరువాత.. సీసీ కెమెరాలు పెట్టాలని అనుకున్నారని సీపీ తెలిపారు. దోపిడీ చేసే సమయంలో నిందితులు ఆసుపత్రిలో తమ బంధువుల చికిత్స కోసం రూ.20 లక్షలు కట్టామని డాక్టర్ భార్యతో చెప్పారని అన్నారు. పీఆర్వోనే ముందుగా డాక్టర్ భార్యను ఎవరో బయట అనుమానాస్పదంగా తిరుగుతున్నారని అలర్ట్ చేశారని సీపీ వివరించారు.

ఇదీ చదవండీ...అమరావతే ఆశగా... రాజధాని సాధనే శ్వాసగా రైతుల ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.