ETV Bharat / city

విజయవాడ గ్యాంగ్​వార్ కేసు: 7 సెంట్లే వివాదానికి కారణం

విజయవాడ గ్యాంగ్​వార్​కు యనమలకుదురులోని 7 సెంట్ల స్థలమే వివాదానికి కారణమని సీపీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. ఇప్పటికే 13 మందిని అరెస్టు చేశామన్న ఆయన.. మరికొంతమందిని త్వరలోనే అరెస్టు చేస్తామని అన్నారు. నిందితుల నుంచి రాడ్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నామన్న ఆయన.. నగరంలో రౌడీషీటర్లపై నిఘా తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

'గ్యాంగ్​వార్ కేసులో 13 మంది అరెస్టు.. 7 సెంట్ల స్థలమే ఘర్షణకు కారణం'
'గ్యాంగ్​వార్​కు 7 సెంట్ల స్థలమే కారణం.. 13 మంది అరెస్టు'
author img

By

Published : Jun 5, 2020, 4:39 PM IST

Updated : Jun 5, 2020, 5:51 PM IST

విజయవాడ గ్యాంగ్​వార్​ వివరాలు వెల్లడిస్తోన్న సీపీ

విజయవాడ గ్యాంగ్​వార్​ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. త్వరలోనే మరింత మందిని అరెస్టు చేస్తామన్న ఆయన.. రౌడీషీటర్లపై నిఘా తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు. సందీప్​, పండు గతంలో సన్నిహితంగా ఉండేవాళ్లని.. కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సీపీ తెలిపారు. యనమలకుదురులోని 7 సెంట్ల స్థలం వల్ల వివాదం ప్రారంభమైందని.. తొలుత మాట్లాడుకుందామని వచ్చి.. అనంతరం వీరి మధ్య ఘర్షణ చెలరేగిందని వెల్లడించారు.

పోలీసులు వెళ్లేసరికే కర్రలు, రాళ్లు, కత్తులు, బ్లేడ్లతో దాడులు చేసుకున్నారని సీపీ తెలిపారు. అప్పటికే చాలామంది గాయపడ్డారని.. 6 టీములుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నామని అన్నారు. నిందితుల నుంచి కత్తులు, కోడి కత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. విజయవాడలో ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటున్నామన్న సీపీ.. ఇలాంటివి మరోసారి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

ఇదీ చూడండి..

చాకచక్యంతో యువతి ఆత్మహత్యను ఆపిన పోలీసులు

Last Updated : Jun 5, 2020, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.