ETV Bharat / city

అధికారుల అవినీతి.. కార్పొరేషన్‌ ఆదాయానికి గండి!

అక్కడ పైసలివ్వనిదే పని జరగదు. డబ్బులు ముట్టనిదే దస్త్రం కదలదు. ఇళ్లు, స్థలాలకు పన్నులు కట్టాలన్నా... ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సిందే. లేదంటే పన్నులు పేరుకుపోతాయ్. మొత్తమంతా ఒకేసారి చెల్లించడమంటే యజమానులకూ తలకు మించిన భారమే. ఇదే అదనుగా కాసుల దందా సాగిస్తున్న బెజవాడ కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగం తీరుతో... నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పడుతోంది. సామాన్య జనమూ ఇబ్బందులు పడుతున్నారు.

Vijayawada
అధికారుల అవినీతి.. కార్పొరేషన్‌ ఆదాయానికి గండి!
author img

By

Published : Apr 9, 2021, 10:24 PM IST

అధికారుల అవినీతి.. కార్పొరేషన్‌ ఆదాయానికి గండి!

విజయవాడ నగరంలో 2 లక్షల 91 వేల కుటుంబాలు ఉన్నాయి. అందులో పన్నులు వేస్తున్న ఇళ్ల సంఖ్య 2 లక్షల 7 వేలు. అంటే దాదాపు 87 వేల నివాసాల నుంచి పన్నులు వసూలు చేయడం లేదు. ఇక కొత్తగా కట్టినవి, నిర్మాణంలో ఉన్నవీ వేలల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇదంతా చూస్తే.. ఇళ్ల యజమానులు పన్నులు కట్టడం లేదేమోనని అనిపిస్తుంది. కానీ వాస్తవం వేరుగా ఉంది. పన్నులు కడతాం బాబూ అంటూ ఇళ్ల యజమానులు వేడుకుంటున్నా.. అధికారులే తీసుకోవడం లేదు. నగరపాలక రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఏవో సాకులు చెబుతూ... ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నారు. బాగా పేరుకుపోయిన తర్వాత పన్నులు కట్టించుకోవాలంటే... చేతులు తడపాల్సిందేనని మెలిక పెడుతున్నారు. ఆ విధంగా కార్పొరేషన్‌ ఖజానాకు తగిన సమయంలో ఆదాయం రాకుండా చేస్తూ... తమ జేబులు నింపుకొంటున్నారు. అధికారుల తీరుతో సకాలంలో పన్ను కట్టలేకపోవడం వల్ల ఇళ్ల క్రయవిక్రయాలకు వీలుండటం లేదని, బకాయిలన్నీ ఒకేసారి చెల్లించడం కష్టమవుతోందని యజమానులు వాపోతున్నారు.

స్థానిక జోన్‌ పరిధిలోని నిర్దేశిత ధర, ఇంటి కొలతల ఆధారంగా పన్ను నిర్ణయిస్తారు. పూర్వీకుల నుంచి వచ్చిన వాటిని సబ్‌ డివిజన్‌ చేసి, నిర్దేశిత ఫీజులు స్వీకరిస్తారు. ఇక కుటుంబసభ్యుల పేరిట ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేస్తే.. విలువపై లక్షకు 200 రూపాయల చొప్పున మ్యుటేషన్‌ ఫీజు స్వీకరించి వారి పేరిట పన్ను వేయాలి. ఖాళీ స్థలంపై వీఎల్​టీ ట్యాక్సు విధించాలంటే ప్రస్తుత రెవెన్యూ విలువ పరిగణనలోకి తీసుకుని.. స్థలవిస్తీర్ణం ఆధారంగా మూడేళ్లకు మాత్రమే విధించాలి. కానీ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది మాత్రం.. ఇలాంటి పనులు చేయడానికీ సాకులు చెబుతున్నారనే ఆరోపణలున్నాయి. వాళ్లకు కొంత ముట్టజెబితే, తగ్గించి పన్నులు వేస్తున్న సందర్భాలూ అనేకం. ఎవరైనా ఆమ్యామ్యాల సమర్పణకు ఇష్టపడకపోతే.. అసలు పన్నే విధించకుండా జాప్యం చేస్తున్నారు.

ఇక ఖాళీ స్థలాలపై పన్ను వేయాలంటే.. కొనుగోలు చేసిన సంవత్సరం నుంచి వీఎల్​టీ పడుతుందని బెదిరించి సొమ్ములు దండుకుంటున్నారు. కుటుంబ సభ్యుల పేరిట సబ్‌డివిజన్‌ చేయాలన్నా, సవాలక్ష వంకలు పెడుతున్నారు. అధికారుల తీరుతో చాలా ఇళ్లకు సకాలంలో ఇంటి పన్ను విధించక.. అటు కార్పొరేషన్‌కు, ఇటు యజమానులకు నష్టం జరుగుతోంది. కొత్త నిర్మాణాలు పూర్తవగానే పన్ను వేస్తే.. దాదాపు రూ.10 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందనే వాదన ఉంది. అలాగే గుర్తించిన ఖాళీ స్థలాలకు వీఎల్​టీ సక్రమంగా వసూలు చేస్తే... మరో 5 కోట్లు ఖజానాలో పడతాయని అంచనా.

ఇదీ చదవండి:

విశాఖ నగరంలో అరణ్యం.. అందులోనూ ఓ రహస్య గ్రామం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.