అందంగా, అమాయకత్వంగా కనిపించే ఆ పిల్లోడు డ్యాన్స్ చూస్తే.. హీరోలా అనిపిస్తుంది. కాలు కదిపితే.. వావ్ అనిపిస్తోంది.. అతడే విజయవాడకు చెందిన కృష్ణ చైతన్య.. చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్త పాశ్చాత్య నృత్య పోటీల్లో మూడో విజేతగా గెలిచాడు. ఇండియా నుంచి ఒకే ఒకడిగా నిలిచాడు.
అమెరికాలోని స్టెప్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పాశ్చాత్య నృత్య పోటీల్లో కిడ్స్ విభాగంలో పాల్గొన్నాడు కృష్ణ చైతన్య. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా దినేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, రుఎల్ మాస్టర్ వ్యవహరించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా పోటీల్లో ఎవరి ఇంటి వద్ద నుంచి వారే పాల్గొన్నారు. ఈ చిన్నోడి విజయం వెనక, తల్లిదండ్రులు ప్రోత్సాహం, గురువు శిక్షణ ఎంతో ఉంది.
పిల్లల్లో ఏ ప్రతిభ దాగుందో ముందుగా తెలిసేది.. అమ్మానాన్నలకే.... చదువుకే పిల్లలని పరిమితం చేయకుండా తమ బిడ్డలతో దాగివున్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడం తల్లితండ్రుల బాధ్యత. కృష్ణ చైతన్యను అదే దారిలో నడిపించారు ప్రసాద్, సువర్ణ. పిల్లాడిలో ప్రతిభను గుర్తించిన డ్యాన్స్ మాస్టర్ కనకప్రసాద్.. సరైన శిక్షణ ఇచ్చాడు. ఇంకేముంది.. కృష్ణచైతన్య డ్యాన్స్‌లో ఇరగదీస్తున్నాడు. భవిష్యత్‌లో సినిమా హీరో కావాలన్నది ఆ బుడ్డోడి కల. ఓ వైపు చదవులోనూ.. చురుకుగా ఉంటూ.. ఉపాధ్యాయుల మన్ననలు పొందుతున్నాడీ లిటిల్ హీరో.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 6,224 కరోనా కేసులు.. 41 మరణాలు