ETV Bharat / city

ముట్టుకొని చెప్పేస్తాడు... వాసన చూసి పసిగట్టేస్తాడు..! - story on mid brain activity

నాలుగో తరగతి చదువుతున్న విజయవాడ బుడతడు తన మేధస్సుతో అబ్బుర పరుస్తున్నాడు. కళ్లకు గంతలు కట్టుకొని.. చేతి స్పర్శ, వాసనతో కరెన్సీనోట్లు, నాణేల విలువలు, రంగులు చెబుతూ ఆశ్చర్య పరుస్తున్నాడు. బాలుడి ప్రతిభ చూస్తున్న వారంతా ఔరా అంటున్నారు.

vijayawada boy doing mid brain activity
విజయవాడలో మిడ్ బ్రెయిన్ యాక్టివిటీలో బాలుడు అదుర్స్​
author img

By

Published : Dec 6, 2019, 4:00 PM IST

విజయవాడ యనమల కుదురుపాత పంచాయతీకి చెందిన షేక్ సాజిద్ 'మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ'తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. కళ్లకు గంతలు కట్టుకొని కరెన్సీ నోట్లు, రంగులు, ఎదురుగా వచ్చిన వారి పేర్లు చెప్పేస్తాడు. సాజిద్​కు గత కొన్ని రోజులుగా మిడ్ బ్రెయిన్ యాక్టివిటీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. శిక్షణకు వెళ్లిన మూడు రోజుల్లోనే వాసన చూసి, స్పర్శతో అన్ని వస్తువులు గుర్తిస్తున్నాడు. కళ్లకు గంతలు కట్టుకొని సైక్లింగ్, స్కేటింగ్ చేసేస్తాడు. బాలుడి ప్రతిభ చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తూ... అందరి మన్ననలు పొందుతున్నాడు.

విజయవాడలో మిడ్ బ్రెయిన్ యాక్టివిటీలో బాలుడు అదుర్స్​

సాజిద్ ముందు తెలిసిన వారు ఎవరైనా నిలబడితే వారి పేర్లు చెబుతాడు, పేర్లు తెలియక పోతే వారు ధరించిన వస్త్రాల రంగులు చెబుతాడు. ఎదురుగా ఉన్న వారికి కళ్లజోడు ఉందా లేదా, చేతులకు ఎన్ని గాజులు ఉన్నాయి, చేతి వేళ్లకు ఎన్ని ఉంగరాలు ఉన్నాయో చెప్పేస్తున్నాడు. పేపరు మీద రాసిన అక్షరాలు తడిమి చదువుతాడు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో పేరు నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు సాజిద్ తల్లి చెబుతున్నారు.

ఇదీ చదవండి...

అప్పుడు వరంగల్​... ఇప్పుడు సైబరాబాద్​.. రియల్​ లైఫ్​ సింగం!!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.