ముఖ్యమంత్రి జగన్పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. అవసరం లేని రిపోర్టులు, స్వామిజీ సూచనలను జగన్ పరిగణలోకి తీసుకోవడం దారుణమని దుయ్యబట్టారు. ప్రజలు ప్రశ్నిస్తారని వైకాపా నేతలు తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ చంద్రబాబు పేరు కనిపించొద్దు అని ఉంటే.. ఎక్కడైనా బోర్డులపై పేరుంటే బ్లాక్ పెయింట్ వేయాలని సూచించారు. భావితరాల భవిష్యత్ గురించి ముఖ్యమంత్రికి చింతలేదని.. వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి పేరుతో ఉద్యమాన్ని అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పిన్నెల్లి దాడి ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని వర్ల రామయ్య కోరారు. వైకాపా నేతలు, మంత్రుల బూతు పురాణం అంబటికి వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: