రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో అనాగరిక పాలన నడుస్తోందని.. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీలు, బీసీలు, మహిళలు, అట్టడుగు వర్గాల వారిపై దాడులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు.
ఇసుక మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు. ఇందుకు వరప్రసాద్‌పై దాడి ఉదాహరణ అని అన్నారు. అధికారులను వేకెన్సీ రిజర్వులో పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని.. దీనివలన ఆయా అధికారులు 50 శాతం జీతం కోల్పోతున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే తమనూ రిజర్వ్‌లో పెడతారేమో అనే భయంతో మిగిలినవారు బాధితులకు న్యాయం చేయడానికి భయపడుతున్నారన్నారు. 2019 జూన్ నుంచి ఈ విధమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను వర్ల కోరారు.
ఇవీ చదవండి...