డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఉంటే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగవని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సవాంగ్‌ను పదవి నుంచి తొలగించాలని ఎస్ఈసీని కోరుతున్నామన్నారు. సమర్థుడు, నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిని ఆ స్థానంలో నియమించాలన్నారు. గత ప్రభుత్వ హయంలో డీజీపీ పదవి ఇవ్వలేదని.. సవాంగ్ తెదేపా పట్ల వ్యతిరేక ధోరణితో ఉన్నారని ఆరోపించారు. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ సవాంగ్‌ను హైకోర్టు మందలించిని వర్ల గుర్తు చేశారు. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోని సవాంగ్‌ను డీజీపీ పదవి నుంచి తొలగించాలన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులను రేంజ్ దాటి బదిలీ చేయాలన్నారు.
ఇదీ చదవండి