ETV Bharat / city

'సిట్​, సీఐడీలతో దేవాలయాలపై దాడి నిందితులు దొరకరు' - వర్ల రామయ్య తాజా వార్తలు

దేవాలయాలపై జరుగుతున్న దాడుల విచారణకై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయటాన్ని తెదేపా నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఉన్న సీఐడీని కాదని.. డీఐజీ స్థాయి అధికారితో సిట్ నియమించడం హిందువులను మభ్యపెట్టడమేనని విమర్శించారు.

varla ramaiah comments on temple attacks
'సిట్​లు, సీఐడీలతో దేవాలయాలపై దాడి నిందితులు దొరకరు'
author img

By

Published : Jan 10, 2021, 3:34 PM IST

హైందవ దేవాలయాలపై జరుగుతున్న దాడుల విచారణకై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయటాన్ని తెదేపా నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. అదో పనికిమాలిన వ్యవహారమని మండిపడ్డారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఉన్న సీఐడీని కాదని.. డీఐజీ స్థాయి అధికారితో సిట్ నియమించడం హిందువులను మభ్యపెట్టడమేనని విమర్శించారు.

రాష్ట్రంలోని హైందవ భక్తుల మనోభావాలతో ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆటలాడుతున్నారని ఆక్షేపించారు. వరుసగా జరుగతున్న దాడుల సూత్రధారులు బయటకు రావాలంటే.. సీబీఐ విచారణ ఒక్కటే మార్గమన్నారు. సిట్​, సీఐడీలతో అసలు దొంగలు దొరకరని ప్రభుత్వానికి కూడా తెలుసని ఎద్దేవా చేశారు.

ఇదీచదవండి

ఎల్లంపల్లి ఆంజనేయస్వామి ఆలయం తలుపులు ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.