ETV Bharat / city

Vangaveeti Ranga 33rd Vardhanthi: రంగా ఆశయాల కోసం పనిచేస్తా: వంగవీటి రాధా

Vangaveeti Ranga 33rd Vardhanthi: విజయవాడలోని బందర్ రోడ్డులో వంగవీటి రంగా 33వ వర్ధంతి నిర్వహించారు. వంగవీటి రాధాతోపాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తదితరులు పూలమాలు వేసి నివాళుర్పించారు. ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని రాధా స్పష్టం చేశారు.

Vangaveeti Ranga 33rd Vardhanthi
Vangaveeti Ranga 33rd Vardhanthi
author img

By

Published : Dec 26, 2021, 11:42 AM IST

Updated : Dec 26, 2021, 2:01 PM IST

Tributes to Vangaveeti Mohana ranga: వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతిని విజయవాడ నగరంలో నిర్వహించారు. రంగా వర్ధంతిని పురస్కరించుకొని విజయవాడ బందర్ రోడ్డులోని ఆయన విగ్రహానికి వంగవీటి రాధా, వల్లభనేని వంశీ, పోతిన మహేష్ ఘన నివాళులు అర్పించారు. ఆయన విగ్రహానికి వంగవీటి రాధా పూలమాల వేశారు. వంగవీటి రాధా ఇంటి వద్దకు భారీగా రంగా అభిమానులు చేరుకొని నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా... వంగవీటి కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ వంగవీటి రాధ కృతజ్ఞతలు తెలిపారు. గత 33 ఏళ్లుగా నాన్న వర్ధంతిని అభిమానులు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆశయ సాధన కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి రంగా అన్నారు. ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని వంగవీటి రాధా స్పష్టం చేశారు.

ఆయన బిడ్డలమని చెప్పడానికి గర్వపడుతున్నా

Vangaveeti Mohana ranga 33rd vardhanthi వంగవీటి రంగా బిడ్డలమని చెప్పడానికి తను గర్వపడుతున్నానని ఎమ్మెల్యే వంశీ అన్నారు. చనిపోయిన తర్వాత కూడా ప్రజలు గుర్తు పెట్టుకునే నాయకులు ముగ్గురు.. ఎన్టీ రామారావు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ,వంగవీటి రంగా అని అన్నారు. వంగవీటి రాధా కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునన్నారు. వంగవీటి రంగా.. ఆయన ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేవమని జనసేన ప్రతినిధి పోతిన మహేష్ వ్యాఖ్యానించారు.

బందర్ రోడ్డులో వంగవీటి రంగా 33వ వర్ధంతి
బందర్ రోడ్డులో వంగవీటి రంగా 33వ వర్ధంతి

వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ

వంగవీటి రంగా వర్ధింతి సందర్భంగా.. వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఇదీ చదవండి..

TIRUMALA HUNDI INCOME: తిరుమల శ్రీనివాసుడి హుండీ ఆదాయం ఎంతంటే?

Last Updated : Dec 26, 2021, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.