రాష్ట్రంలో వార్డు వాలంటీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ సిబ్బందిగా ఉండాల్సిన వారు పార్టీ కార్యకర్తలను మించి ప్రవర్తిస్తున్నారని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షరాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలపై ఆకృత్యాలు జరుగుతుంటే రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయాలని చెప్తున్న వాసిరెడ్డి పద్మ, కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై నిర్భయ కేసు ఎందుకు పెట్టలేదో చెప్పాలని నిలదీశారు.
శాసన మండలి ప్రసారాలు లైవ్ ఆపేసి మరీ మంత్రులు బూతులు తిట్టుకుంటున్నారన్నారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తించే మంత్రి అనిల్ కుమార్ దగ్గర నుంచి గ్రామ వాలంటీర్ వరకు మహిళలపై దాడులు చేసిన వైకాపా పార్టీ వారిపై కేసులు పెట్టి.. అప్పుడు అయ్యన్నపాత్రుడి గురించి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మాట్లాడాలని హితవు పలికారు.
ఇవీ చదవండి... : కరోనా అంతం కోరుతూ వేదపండితుల జలదీక్ష !