ETV Bharat / city

తెలంగాణ: వారంలో నాలుగురోజులు వ్యాక్సినేషన్... రేపే ప్రారంభం

author img

By

Published : Jan 15, 2021, 6:13 PM IST

రేపటి నుంచి ప్రారంభంకానున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిమ్స్​లో గవర్నర్ తమిళిసై, గాంధీ ఆసుపత్రిలో మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభిస్తారని ప్రజారోగ్య సంచాలకులు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌కి రాష్ట్రంలో 1,213 సెంటర్‌లు సిద్ధం చేసినట్లు వివరించారు.

Vaccination program 4 days a week
తెలంగాణ:వారంలో నాలుగురోజులు వ్యాక్సినేషన్... రేపే ప్రారంభం'

తెలంగాణ రాష్ట్రంలో ప్రతివారంలో 4 రోజులు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. వ్యాక్సినేషన్‌ కోసం రాష్ట్రంలో 1,213 సెంటర్‌లు సిద్ధం చేశామన్నారు. పట్టణప్రాంతాల్లో ప్రైవేటు ఆస్పత్రులను వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యం చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సిద్ధం చేశామన్నారు.

వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సమన్వయం కోసం హైదరాబాద్‌లో నోడల్‌ అధికారిని నియమించామని పేర్కొన్నారు. నిమ్స్‌లో గవర్నర్‌, గాంధీ ఆస్పత్రిలో మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తామని స్పష్టం చేశారు.

కొవాగ్జిన్ తెలంగాణ గడ్డ మీద తయారవడం గర్వించాల్సిన విషయమన్నారు. గాంధీ , నార్సింగి రీజనల్ హెల్త్ సెంటర్​లలో వ్యాక్సిన్ తీసుకున్న వారితో ప్రధాని మాట్లాడేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు.

ఇదీ చదవండి:

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరగనుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.