ఏపీ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ నూతన ఛైర్మన్‌గా వి.గురునాధం ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ పాల్గొన్నారు. 1985 నుంచి అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ లీగల్ సెల్‌కు ఉందని గురునాధం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో లీగల్ సెల్లు ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగే దాడులపై కోర్టుల ద్వారా పోరాడతామన్నారు. రాబోయే కాలంలో భౌతికంగా జరిగే ఉద్యమాల కన్నా..న్యాయపరంగా జరిగే ఉద్యమాలే ఎక్కువ అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే అన్యాయపు జీవోలపై న్యాయస్థానాల్లో పోరాడుతామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి