లాక్డౌన్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు సొంతూళ్లకు పయనమయ్యారు. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల కాలినడకనే నమ్ముకున్నారు. హైదరాబాద్ నుంచి నాలుగు రోజులుగా నడుచుకుంటూ అన్ని జిల్లాల చెక్ పోస్టులను దాటుకుని విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న 22 మంది కూలీలను విజయవాడ రథం సెంటర్లో ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. వారి పరిస్థితిని తెలుసుకొని భోజనాలను ఏర్పాటు చేసి...ప్రశాంతినగర్‌లోని బీసీ సంక్షేమ వసతి గృహానికి తరలించారు.
కాలినడకన సొంతూళ్లకు బయలుదేరిన ఉత్తరప్రదేశ్ వలస కూలీలు - Uttar Pradesh migrant laborers who set out on foot on their own
లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. చేసేందుకు పనిలేక తమ సొంతూళ్లకు పయనమయ్యారు. వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక కాలినడకననే నమ్ముకున్నారు. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు కాలి నడకన వెళ్తున్న కూలీలను విజయవాడలో పోలీసులు అడ్డుకున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు సొంతూళ్లకు పయనమయ్యారు. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల కాలినడకనే నమ్ముకున్నారు. హైదరాబాద్ నుంచి నాలుగు రోజులుగా నడుచుకుంటూ అన్ని జిల్లాల చెక్ పోస్టులను దాటుకుని విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న 22 మంది కూలీలను విజయవాడ రథం సెంటర్లో ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. వారి పరిస్థితిని తెలుసుకొని భోజనాలను ఏర్పాటు చేసి...ప్రశాంతినగర్‌లోని బీసీ సంక్షేమ వసతి గృహానికి తరలించారు.
ఇదీ చదవండి:
తీర్థయాత్రలకు వెళ్లిన రాష్ట్రవాసులు క్వారంటైన్‌కు..!