ETV Bharat / city

'చెత్త సేకరణపై పన్ను వసూళ్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి' - చెత్త సేకరణపై పన్ను వసూళ్లు

పట్టణాల్లో చెత్త సేకరణపై పన్ను వసూళ్ల మీద ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పట్టణ పౌర సమాఖ్య డిమాండ్ చేసింది. చెత్తపై సేవా చార్జీలు వసూలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదని సమాఖ్య ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

Urban Civil Federation
చెత్త సేకరణపై పన్ను వసూళ్లు
author img

By

Published : Mar 24, 2021, 4:31 PM IST

ఎన్నడూ లేని విధంగా చెత్త సేకరణపై చార్జీలు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం శోచనీయమని పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ బాబురావు అన్నారు. వెంటనే ఆ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలో సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి జగన్​ సమక్షంలో మంగళవారం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో చెత్తపై సేవా ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశాలు వెలువడినట్లు ఆయన తెలిపారు. గ్రేడ్ 1,2,3 మున్సిపాలిటీల్లో రోజుకు ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి రూ.365, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో రోజుకు 2రూపాయల చొప్పున సంవత్సరానికి రూ.730, నగరపాలక సంస్థల్లో రోజుకి రూ.3 చొప్పున సంవత్సరానికి రూ. 1100 ప్రతి కుటుంబం నుంచి వసూలు చేయాలని ఆదేశించారని ఆయన ఆరోపించారు.

చెత్త సేకరణపై పన్ను విధించడం బాధాకరమని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పౌరసేవలను అందించాల్సిన బాధ్యత.. ప్రభుత్వం, ఎన్నికైన కౌన్సిల్స్​పై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చెత్తపై పన్ను వసూలుకు ఆదేశాలివ్వడం స్థానిక సంస్థల స్వయం నిర్ణయాధికారాన్ని కాలరాయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

నత్తనడకన తాగునీటి పథకం పనులు.. వేసవిలోనూ అరకొర నీటి సరఫరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.