విజయవాడ సింగ్ నగర్ పైపుల రోడ్డు వద్ద ఓ బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఓ గోవు తీవ్రంగా గాయపడింది. ప్రమాదంలో ఆవు వెనుక రెండు కాళ్లు నలిగిపోగాయి. సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల హుటాహుటిన వచ్చి ఆవుకి కట్టు కట్టించి.. దాని దూడకు ఆహారం అందించారు. తన తల్లికి ఏమైందో తెలియక అమాయకంగా కనిపించిన ఆ మూగజీవాన్ని చూసి స్థానికులు చలించిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :